ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు మార్చాలి.. : అసోం సీఎం హిమంత శర్మ డిమాండ్

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పేరు మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన పేరులో నుంచి గాంధీ అనే పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.
 

assam cm himanta sarma now wants rahul gandhi should change name kms

గువహతి: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం దేశాన్ని ముక్కలు చేసే పనిలో ఉన్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన పేరులోని ‘గాంధీ’ తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీ 20 సదస్సులోనూ ఇండియా పేరు కాకుండా భారత్ అని ఉపయోగించిన సంగతి తెలిసిందే.

గాంధీ కుటుంబం డూప్లికేట్ల సర్దార్ అని ఆరోపించారు. ఈ కుటుంబం ఎన్నో స్కాములు చేసిందని అన్నారు. వాళ్ల ఫస్ట్ స్కామ్ గాంధీ పేరును పెట్టుకోవడం నుంచే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. వాళ్లు కేవలం వారసత్వం కోసమే పని చేశారని చెప్పారు. రాహుల్ గాంధీ తన పేరులోని గాంధీని తీసేయాలని కోరారు. అసోం రాజధాని గువహతిలో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.

‘మరో రెండేళ్లలో కామాఖ్య కారిడార్ నిజరూపం దాలుస్తుంది. కేవలం ప్రధానిమంత్రి మోడీ వల్లే ఢిల్లీ డిక్లరేషన్ సాధ్యమైంది. ఒక వైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతున్నా ఈ డిక్లరేషన్‌ను ఆయన సాధ్యం చేసి చూపించారు. భారత స్వాతంత్ర్య 25వ దినోత్సవం లేదా 50వ దినోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేట్ చేయలేదు. కానీ, మోడీ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ భారతీయుడిగా అనుభూతి చెందుతున్నారు. గొప్ప సంస్కరణకర్త మహాపురుషుడు శంకరదేవా 500 ఏళ్ల క్రితమే భరత భూమి గురించి రాశాడు. ఇది మన భరత భూమి’ అని శర్మ అన్నారు.

Also Read : ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ ప్రచారం - ప్రశాంత్ భూషణ్

‘ప్రపంచ నేతలతో నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా నేను చూస్తూ ఉంటే.. భారత్ ఇప్పటికే విశ్వగురువుగా అవతరించిందని అనిపించింది. ఇప్పుడు మహిళలు దేశాన్ని నడిపిస్తున్నారు. నరేంద్ర మోడీ నారీ శక్తి, మహిళా సాధికారత మీద ఎక్కువ దృష్టి పెడతారు. కొన్ని రోజుల క్రితమే మేం బాల్య వివాహాలను అడ్డు కునే ఆపరేషన్ ప్రారంభించాం. తొమ్మిదేళ్లకే పెళ్లి చేయడం, 12 ఏళ్లకు పిల్లలను కనడం అసోంలోని ఓ వర్గంలో అనాది గా వస్తున్నది. హిందువులు ఎవరూ కులాలను సమర్థించరు. కానీ, తమిళనాడు మంత్రి హిందువులకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు’ అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios