కుక్కబిస్కెట్లు తిననన్నాను.. రాజీనామా చేశాను... రాహుల్ గాంధీ వైరల్ వీడియోపై అస్సాం సీఎం హిమంత శర్మ

రాహుల్ గాంధీ కుక్కపిల్లకి బిస్కెట్ పెట్టే వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీద అస్సాం ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Assam CM Himanta Biswa Sarma on Rahul Gandhi's viral video - bsb

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిమీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తన అభిమాని తెచ్చిన ఓ కుక్కకు బిస్కెట్లు ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ అధికారిక వెబ్ సైట్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 

ఇంతకీ ఈ వీడియోలో జార్ఖండ్‌ రాహుల్ పాద యాత్ర సందర్భంగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకువచ్చాడు. దానికి బిస్కెట్ ఇవ్వడం కోసం బిస్కెట్ల ప్యాకెట్ ఉందా? అని తన సహాయకులను అడుగుతారు రాహుల్ గాంధీ. వారు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వగానే అందులోనుంచి ఓ బిస్కెట్ తీసి దానికి తినిపించే ప్రయత్నం చేశారు. అయితే, అది బిస్కెట్ తినడానికి ఇష్టపడలేదు. 

మరోవైపు, రాహుల్ అభిమానులు, పలువురు మద్దతుదారులు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. కుక్కకు బిస్కెట్ తినిపిస్తూనే వారితో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని చేతులు చాపినప్పుడు.. కుక్క నిరాకరించిన బిస్కెట్ ను అతనికి ఇవ్వడం కనిపిస్తుంది. 

భారత్ రైస్ ఎలా కొనుక్కోవచ్చు? ఎక్కడ దొరుకుతాయంటే...?

ఇందులో.. అధికారిక భారత్ జోడో యాత్ర హ్యాండిల్ రాహుల్ గాంధీ కుక్కపిల్లకి బిస్కెట్ పెట్టే వీడియోను షేర్ చేసింది, కానీ ఆ క్లిప్ లో బిస్కెట్ వేరే వ్యక్తికి ఇవ్వడం కనిపించదు. మరో వీడియోలో రాహుల్ కుక్క తినని బిస్కెట్ ను వేరే వ్యక్తికి ఇవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడీ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 

చాలా మంది కాంగ్రెస్ నాయకుడు తన మద్దతుదారులతో, పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే, కొంతమంది మాత్రం ఆ కుక్కపిల్ల గాంధీతో మాట్లాడుతున్న మద్దతుదారునికి చెందినదని, కుక్కపిల్లకి ఆహారం ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు మామూలు బిస్కెట్లు ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ విషయంపై గతంలో కాంగ్రెస్‌లో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ అభిప్రాయాలను చాలా మంది ట్యాగ్ చేశారు. శర్మ తరచూ ఒక సంఘటనను వివరిస్తూ ఉంటారని.. అందులో బిస్వశర్మ, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ తో సమావేశం అయినప్పుడు.. రాహుల్ పెంపుడు కుక్క ప్లేట్ లోని బిస్కెట్లు తిన్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు అదే ప్లేట్ నుండి బిస్కెట్లు అందించారని శర్మ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. 

ఈ ఇంటర్వ్యూల సమయంలో, పార్టీ కీలక విషయాలపై గాంధీకి అంత సీరియస్‌గా లేరన్న తన వాదనను బలపరిచేందుకు శర్మ ఆరోపించిన సంఘటనను ఉపయోగించారు. ఆ వెంటనే తాను కాంగ్రెస్‌ను వీడినట్లు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కుక్క వీడియో వైరల్ అవ్వడంతో హిమంత్ బిశ్వశర్మ మరోసారి దాడికి దిగారు. తనను ట్యాగ్ చేసిన ఒక నెటిజన్ కు స్పందిస్తూ, "రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తం కలిసినా నన్ను ఆ బిస్కెట్ తినేలా చేయలేకపోయారు" అని అన్నారు. 

అంతేకాదు.. "నేను ప్రౌడ్ అస్సామీని, భారతీయుడిని, నేను ఆ బిస్కెట్ తినడానికి నిరాకరించాను, కాంగ్రెస్‌కు రాజీనామా చేసాను" అని ఆయన అన్నారు. వైరల్ వీడియోపై రాహుల్ గాంధీని ఇతర బిజెపి నాయకులు కూడా నిందించారు. పార్టీ కార్యకర్తలను కుక్కల్లాగా చూసేలా యువరాజు ప్రవర్తించినప్పుడు పార్టీ అంతరించిపోవడం సహజమేనని అమిత్ మాల్వియా అన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios