Ayodhya: హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభ తరుణం సమీపిస్తుంది. అదే అయోధ్య రామ మందిరం ప్రారంభం. ఈ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని చెప్పారు. 

Ayodhya: కోట్లాది మంది హిందువులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు జరుగుతాయని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా పలు విషయాలను వెల్లడించారు. వచ్చే జనవరి 14 న రామాలయంలో ప్రార్థనలు, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. 

" ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాము. జనవరి 14 నుండి ప్రార్థనలు, ప్రత్యేక పుజాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జనవరి 24 తేదీన నిర్ణయించి ముహుర్త సమయంలో శ్రీరాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఇక్కడ రాముని విగ్రహం ప్రతిష్టించబడుతుంది. మరుసటి రోజు నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తాం. ఆ మహా విగ్రహం ముందు తాత్కాలిక ఆలయంలో ఉన్న శ్రీరాముని విగ్రహం ఉంటుంది." అని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ వెల్లడించారు. దాదాపు 10 రోజుల పాటు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. రామ మందిర ప్రారంభోత్సవం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలను దేశ, విదేశాల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 

దాదాపు ఏడాది క్రితం ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అయోధ్యలో రాముడి గొప్ప ఆలయాన్ని నిర్మిస్తున్న నిర్మాణ స్థలాన్ని సందర్శించింది. అప్పటి నుండి ఆలయ నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. గొప్ప రామాలయం రూపుదిద్దుకుంది. గతేడాది కూడా ఆలయ నిర్మాణం ప్రారంభంలో నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా పలు విషయాలను ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌ టీమ్ తో పంచుకున్నారు.

పూర్తి ఇంటర్వ్యూ త్వరలో మీ ఏషియానెట్ న్యూస్ లో ప్రసారం అవుతుంది.