ఏసియానెట్‌ న్యూస్‌ మరో సంచలనం: యూట్యూబ్‌లో 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌

ఏసియానెట్‌ న్యూస్‌ మరో కీలక మైలు రాయి దాటింది.  10 మిలియన్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను చేరుకున్న తొలి మలయాళ న్యూస్ ఛానల్‌గా అవతరించింది. డిజిటల్ స్పేస్‌లో ఛానల్ ప్రజాదరణను ఇది చాటుతోంది. 

Asianet News Achieves Major Milestone: First Malayalam News Channel with 10 Million YouTube Subscribers GVR

కొన్నేళ్లుగా రేటింగ్స్ పరంగా ఇతర న్యూస్ ఛానెళ్ల కంటే ఎంతో ముందున్న ఏసియానెట్ న్యూస్ డిజిటల్ రంగంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. 10 మిలియన్ల యూట్యూబ్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న తొలి మలయాళ న్యూస్ మీడియాగా నిలిచింది. 

ఏసియానెట్ న్యూస్ 10 మిలియన్ల సబ్ స్క్రైబర్లను దాటి యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. ఏసియానెట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ 10.2 బిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా యూట్యూబ్ డైమండ్ బటన్ ను ప్రదానం చేసింది. అత్యుత్తమ కంటెంట్ ఇస్తున్న అతి కొద్ది మంది క్రియేటర్లలో ఏసియానెట్ ఒకటని ప్రశంసించింది.

 

Asianet News Achieves Major Milestone: First Malayalam News Channel with 10 Million YouTube Subscribers GVR

ఏసియానెట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ 2008 సెప్టెంబరులో ప్రారంభమైంది. 2018 ఫిబ్రవరిలో 10 లక్షల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని సాధించింది. 2019 ఫిబ్రవరిలో 2.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. 2020 ఏప్రిల్ నాటికి 4 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లను సాధించింది. 2021 జనవరి కల్లా 5 మిలియన్ల మార్కును దాటేసింది. ఇక్కడి నుంచి 90 లక్షల మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే 10 మిలియన్లు (కోటి) మంది వీక్షించే వేదికగా ఏసియానెట్ న్యూస్ చరిత్ర సృష్టించింది.

రేటింగ్స్ లో ఏసియానెట్ న్యూస్ ముందంజ...

కొన్నేళ్లుగా రేటింగ్స్ పరంగా ఇతర న్యూస్ ఛానెళ్ల కంటే ఎంతో ముందున్న ఏషియానెట్ న్యూస్ డిజిటల్ రంగంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. మలయాళీలు ఫేస్ బుక్ లో ఏషియానెట్ న్యూస్ ను కూడా సెర్చ్ చేస్తుంటారు. 60 లక్షల మంది మలయాళీలు ఫేస్ బుక్‌లో ఏషియానెట్ న్యూస్ ను ఫాలో అవుతున్నారు. ఏషియానెట్ న్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చాలా ముందుంది. కొత్త తరానికి ఇష్టమైన డిజిటల్ స్పేస్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios