Asianet News TeluguAsianet News Telugu

Asianet News: మరాఠీ భాషకూ విస్తరించిన ఏషియానెట్ న్యూస్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రారంభం

ఏషియానెట్ న్యూస్ మరో కీలక అడుగు వేసింది. ఇది వరకే ఏడు భాషల్లో పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ మీడియా సంస్థ తాజాగా మరాఠీ భాషలోనూ సేవలు అందించనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ముంబయిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో 5వ తేదీన ప్రారంభించారు.
 

asianent news digital launches news service in another language, in the presence of devendra fadnavis marathi platform started kms
Author
First Published Dec 5, 2023, 10:47 PM IST

ముంబయి: ప్రముఖ మీడియా సంస్థ ఏషియానెట్ న్యూస్ మరో భాషలోకి విస్తరించింది. ఇది వరకే ఏడు భాషల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని, వార్తలను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా ఎనిమిదో భాష మరాఠీలోనూ ఈ సేవలు అందించనుంది. ఈ రోజు ముంబయిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ ప్లాట్‌ఫామ్‌ను సంస్థ ప్రారంభించింది. ముంబయిలోని ప్రెస్‌క్లబ్‌లో డిసెంబర్ 5వ తేదీన ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది.

ఏషియానెట్ న్యూస్ (Asianetnews.com) ఇది వరకే మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బంగ్లాలో వార్తలు అందిస్తున్నది. తాజాగా ఈ ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్రకూ విస్తరించింది.  మరాఠీ ప్లాట్‌ఫామ్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవ్వగా, మహారాష్ట్ర వాటర్ రీసెర్సెస్ రెగ్యులారిటీ అథారిటీ సెక్రెటరీ డాక్టర్ రామనాథ్ సోనవానె, ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రవీన్ దబాస్, యాక్టర్, నిర్మాత ప్రీతి జాంగియానీ సహా పలువురు ప్రముఖులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోతైన ప్రాంతీయ అవగాహన, విశ్వసనీయతను కలిగి ఉన్న ఏషియానెట్ న్యూస్ విలువైన, నాణ్యమైన సమాచారాన్ని అందిస్తున్నది. ఇదే లక్ష్యాన్ని మహారాష్ట్రలోనూ కొనసాగిస్తుంది. వార్తలు, వీడియో కంటెంట్‌తో మహారాష్ట్ర పాఠకులను అలరించనుంది.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. జెన్యూస్ వార్తలను అందించే ఏషియానెట్ న్యూస్ వంటి సంస్థలు నేటి అవసరం అని, ముఖ్యంగా ఏఐ ఆధారిత డీప్ ఫేక్, ఇతర విపరిణామాలను ఎదుర్కోవాలంటే ఇలాంటి సంస్థల అవసరం ఉన్నదని తెలిపారు. అవాస్తవాలు, వదంతులను, దుష్ప్రచారాలకు చెక్ పెట్టి విశ్వసనీయమైన, వాస్తవమైన వార్తలను మరాఠీ ప్రజలకు అందిస్తుందని ఆశించారు.

asianent news digital launches news service in another language, in the presence of devendra fadnavis marathi platform started kms

ఏషియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రా మాట్లాడుతూ.. దేశంలో ఇంటర్నెట్ బలంగా చొచ్చుకెళ్లిన మూడో రాష్ట్రమైన మహారాష్ట్రలో మాట్లాడే మరాఠీ మన దేశంలోకీ కీలక భాష అని, మరో భాషలోకి విస్తరించాలని తాము ఆలోచించినప్పుడు మరాఠీ భాషను ఏకగ్రీవంగా ఎంచుకున్నామని చెప్పారు. హై క్వాలిటీ కంటెంట్, విశ్వసనీయమైన వర్గాల నుంచి వాస్తవ సమాచారాన్ని అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

సంస్థ సీఈవో నీరజ్ కోహ్లీ మాట్లాడుతూ.. ఏడు భాషల్లో సాధించిన విజయాలనే మరాఠీ భాషలోనూ అందుకోవాలని అనుకుంటున్నామని, మహారాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిజం చేస్తామని చెప్పారు. సూటిదనం, నిర్భీతి, నిరంతరం అనే సూత్రం ఆధారంగా మరాఠీ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడానికి అనునిత్యం కృషి చేస్తామని సీవోవో సమర్థ్ శర్మ తెలిపారు.

నెలకు 8 కోట్ల యాక్టివ్ యూజర్లతో అగ్రపథంలో ఉన్న ఏషియానెట్ న్యూస్ ఇప్పుడు మరాఠీలోకి అడుగిడింది. ఈ సంస్థకు టీవీ చానెళ్లు(ఏషియానెట్ న్యూస్, ఏషియానెట్ సువర్ణ న్యూస్), ప్రింట్ పబ్లికేషన్(కన్నడ ప్రభ), మ్యూజిక్ ప్లాట్‌ఫామ్(ఇండిగో మ్యూజిక్.కామ్), డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌(ఏషియానెట్‌న్యూస్.కామ్, మైనేషన్.కామ్)లతో దేశవ్యాప్తంగా అనేక భాషల్లో కీలక మల్టీ మీడియాగా ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios