Asianet News TeluguAsianet News Telugu

అసదుద్దీన్‌ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ కోచ్‌పై రాళ్ల దాడి.. అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళ్తుండగా ఘటన

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మరో సారి గుర్తు తెలియని దుండగులు దాడికి ప్రయత్నించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సూరత్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

Asaduddin Owaisi's Vande Bharat coach was attacked with stones. The incident happened while going from Ahmedabad to Surat.
Author
First Published Nov 8, 2022, 5:16 AM IST

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ కోచ్ పై రాళ్ల దాడి జరిగింది. గుజరాత్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆయన అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన కంపార్ట్‌మెంట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.

భారత్ జోడో యాత్రను ఎవ్వరూ ఆపలేరు.. అది శ్రీనగర్‌లోనే ముగుస్తుంది - రాహుల్ గాంధీ

ఒవైసీ సూరత్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ రైలులో ప్రయాణించారు.  అయితే తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను ఆయన అంతకు ముందు ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. కాగా.. ఒవైసీపై దాడిని ఏఐఎంఐఎం నేత వారిస్‌ పఠాన్‌ ధృవీకరించారు. ఈ రాళ్లదాడి ఘటన సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. తాము వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో సూరత్‌లో ఇది చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో రైలు అద్దాలు పగిలిపోయాయని కూడా వెల్లడించారు. పగిలిన కిటికీ అద్దాలకు సంబంధించిన చిత్రాలను కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హాపూర్ జిల్లాలో అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కారు హాపూర్-ఘజియాబాద్ రోడ్డులోని ఛిజార్సీ టోల్ ప్లాజా సమీపంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. యూపీ ఎన్నికలకు సంబంధించి ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఛిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి.

అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన కేసులో ఇద్దరు నిందితులు సచిన్, శుభమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని అనుసరించారు. ఆయన సమావేశాలకు హాజరయ్యేవారు. దాడి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కానీ వారికి సరైన అవకాశం లభించలేదు. అయితే నిందితుడు సచిన్ సమయం చూసి ఒవైసీ కారుపై బుల్లెట్ పేల్చాడు. ఈ ఘటన నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios