Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు మూడోసారి బెయిల్ నిరాకరించిన కోర్టు..
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ గతవారంం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తన స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించిన తరువాత బుధవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
ముంబయి : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు aryan khanకు సోమవారం కూడా బెయిల్ దొరకలేదు. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ముంబయి కోర్టు మూడోసారి bail నిరాకరించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ గతవారంం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తన స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించిన తరువాత బుధవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
నిజానికి శుక్రవారం వరకు ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్ సీబీ కోర్టును కోరింది. ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన కోర్టు, ఎన్ సీబీకి బుధవారం వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కాగా, ఆర్యన్ ఖాన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. అతడి వద్ద డ్రగ్స్ ను గుర్తించలేదని వెల్లడించారు. ఇన్ని రోజులు కస్టడీలో ఉంచడం సరికాదని వాదించారు.
ఆర్యన్ కు బెయిల్ ఇవ్వొద్దని, అతడిని విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఇదివరకే ఎన్ సీబీ కోర్టుకు వెల్లడించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని తెలిసింది.
కాగా, గతవారం mumbai drugs caseలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ. దీంతో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
ముంబై డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ... 14 రోజుల రిమాండ్
ఇక అక్టోబర్ 2న ముంబై అరేబియా సముద్రంలో క్రూయిజ్ షిప్ లో rave party నిర్వహించారన్న ఆరోపణలపై సోమవారం ఆర్యన్ ఖాన్ తో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాలుగు రోజులుగా ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్, విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కోర్టులో హాజరుపర్చారు ఎన్సీబీ అధికారులు. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఆర్యన్ ఖాన్ ఫోన్ లో కీలకమైన సమాచారం ఉందని ఎన్సీబీ అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్యన్ నుండి కొకైన్ కూడ సీజ్ చేసినట్టుగా కోర్టుకు తెలిపింది కోర్టు. ఆర్యన్ ఖాన్ నుండి డ్రగ్స్ కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎన్సీబీ అధికారులు కోరారు. ఎన్సీబీ అధికారుల వినతికి కోర్టు అంగీకరించింది. మొదట ఈ నెల 7వ తేదీ వరకు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.