ఎనిమిదోసారి ఈడీ విచారణకు దూరం: మార్చి 12 తర్వాత హాజరౌతానన్న కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఎనిమిదో సారి  అరవింద్ కేజ్రీవాల్  ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు.విచారణకు హాజరు కాకుండా  ఈడీకి కేజ్రీవాల్ లేఖ రాశారు.

Arvind Kejriwal writes to ED: ready to answer questions; seeks date after March 12  lns


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  న్యూఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సోమవారంనాడు ఈడీ విచారణకు  గైర్హాజరయ్యారు. అయితే  ఇవాళ విచారణకు రావాలని  ఈడీ అధికారులు  ఇటీవలనే నోటీసులు పంపారు. అయితే  ఇవాళ విచారణకు హాజరు కాకుండా ఈడీ అధికారులకు  అరవింద్ కేజ్రీవాల్ ఓ లేఖ పంపారు.

also read:పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు:బెంగుళూరు వాసులకు సూచన ఇదీ..

ఈడీ అధికారుల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పేందుకు  సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఈడీ అధికారులు తనకు ఇచ్చిన నోటీసు చట్టవిరుద్దమైనప్పటికీ  తాను సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టుగా కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ నెల  12వ తేదీ తర్వాత  ఈడీ అధికారుల విచారణకు తాను హాజరౌతానని చెప్పారు. అంతేకాదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారీ  ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఆ లేఖలో  కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

also read:సిక్స్‌ను అడ్డుకొని రనౌట్: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో

ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు  ఏడు నోటీసులు జారీ చేశారు.  ఏడో విడత కూడ  ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో ఎనిమిదో సారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని కోరారు.  అయితే  తాము నోటీసులు జారీ చేసినా అరవింద్ కేజ్రీవాల్  విచారణకు హాజరు కాకపోవడంపై  ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  ఈడీ జారీ చేసిన నోటీసులను చట్ట విరుద్దమని గతంలో కూడ  కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.

also read:అదే కొంపముంచింది: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్

ఈడీ విచారణకు హాజరు కాకుండా  కేజ్రీవాల్ డుమ్మా కొట్టడంపై  గతంలోనే బీజేపీ విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు  కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. విచారణ నుండి పారిపోయావని కేజ్రీవాల్ పై మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios