ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విజయఢంకా మోగించాడు. ఉన్న 70 అసెంబ్లీ సీట్లలో 63 సీట్లను గెలిచి చరిత్ర సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విజయం కేజ్రీవాల్ దే నాని చెప్పినప్పటికీ ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రమే వారి మధ్య ఒక చిన్న తేడా ఉంది. 

ఇక ఈ ఎన్నికల్లో ప్రచారం మునుపెన్నడూ చూడనంత హాట్ హాట్ గా నడిచింది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ఇటు బీజేపీ అటు ఆమ్ ఆద్మీపార్టీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం అంతా కూడా ఈ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టినా కూడా కేజ్రీవాల్ విజయాన్ని మాత్రం ఎవ్వరు ఆపలేకపోయారు. 

Also read: అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని తానై ప్రశాంత్ కిషోర్ మోసాడని మనకు బయటకు కనబడుతుంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ తో జత కట్టింది డిసెంబర్లో. అంతకన్నా ముందు నుండే కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ తండ్రికోసం ఢిల్లీ వీధులన్నిటిలో తిరగడం మొదలుపెట్టింది. 

ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కూడా రావడం, కేజ్రీవాల్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో అందరూ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ కూతురు గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మనము కూడా కేజ్రీవాల్ కూతురి క్రేజీ ప్రచారం ఏమిటో తెలుసుకుందాం. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం ఆయన కూతురు ఆక్టోబర్లోనే ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల సమయం ముందునుంచే అరవింద్ కేజ్రీవాల్ కూతురు మాత్రం నాన్న కోసం ప్రచారం మొదలుపెట్టేసింది. 

కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ ఒక ఎమ్మెన్సీ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తుంది. చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంజనీరింగ్ ను ఐఐటీ ఢిల్లీ నుంచి పూర్తి చేసింది. కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన హర్షిత ఇప్పుడు నాన్నను మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు 5నెలల సెలవు పెట్టిమరీ ప్రచారంలోకి దిగింది. విజయవంతంగా తండ్రిని అధికార పీఠాన్ని ఎక్కించింది. 

Also read: కేజ్రీవాల్ విజయం: సీఎం పీఠం ఎక్కిన నేతలు, తెర వెనక భార్యల వ్యూహాలు

ఇలా కేజ్రీవాల్ కూతురు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కన్నా ముందు ప్రచార బాధ్యతలన్నిటిని భుజాన వేసుకొని నడిపిస్తే... ప్రశాంత్ కిషోర్ వచ్చి చేరిన తరువాత అతని టీంకి మిగిలిన ఆప్ కార్యకర్తలను, నేతలను సమన్వయపరుస్తూ ఎన్నికల బరిలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆప్ కు విజయాన్ని అందించింది.