కేజ్రీవాల్ విజయం: సీఎం పీఠం ఎక్కిన నేతలు, తెర వెనక భార్యల వ్యూహాలు

First Published Feb 11, 2020, 3:08 PM IST

మూడో సారి ఢిల్లీ పీఠం ఎక్కడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ లైన్ క్లియర్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆప్ విజయంతో సునీతా కేజ్రీవాల్ తెర వెనుక నుంచి తెర ముందుకు వచ్చినట్లయింది. ఆమె కేజ్రీవాల్ విజయం కోసం ప్రచారం సాగించారు. తెర వెనక ఆమె చాలా శ్రమించారని అర్థమవుతోంది. మా హీరోకు మీరే బలం అంటూ ఓ నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాక ముందు ఇరువురు ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేశారు. కేజ్రీవాల్ వెనక బలం ఆమెనే అని నెటిజన్లు అంటున్నారు. ఈ స్థితిలో తమ భర్తలను గెలిపించి సీఎం పీఠం ఎక్కే వరకు తెర వెనక పనిచేసిన భార్యల గురించి తెలుసుకుందాం.

జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సొరేన్ రెండో దఫా ముఖ్యమంత్రి కావడం వెనక కూడా ఆయన భార్య వ్యూహం ఉందని అంటారు. ఎప్పుడైతే జేఎంఎం- ఆర్జేడీ-కాంగ్రెస్ ల కూటమి అధికారం కైవసం చేసుకోవడం ఖాయమైందో అప్పడి నుండి హేమంత్ సొరేన్ ఫోటోలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆయనతోపాటు ఆయన భార్య ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.... ఎన్నికల్లో ఆమె కీలక బాధ్యతలను చూసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

హేమంత్ సొరేన్- కల్పనా సొరేన్.. హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఖరారు అయ్యాక ఆయన తన ఫ్యామిలీతో ఫోటోలు దిగాడు. తొలుత తండ్రి శిబుసొరేన్ కు పాదాభివందనం చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తరువాత ఆయన భార్య పిల్లలతో ఉన్న మరో ఫామిలీ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు బయటకు వస్తుండగానే పాతదొక ఫోటో సోషల్ ,మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కుంపటిపై వంట వండుతుండగా హేమంత్ సొరేన్ ఆమె పక్కన నిల్చున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. దానితో ఈమె ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత సర్వత్రా మొదలయ్యింది. ఇంటర్ నెట్ నిండా ఇందుకు సంబంధించి ఇదే టాప్ సెర్చ్. ఈ పరిణామాల క్రమంలో ఆమె ఎవరు రాజకీయంగా తన భర్తకు ఏ విధంగా సహకరించారు, వారిద్దరి ప్రేమ పెళ్లి మీకోసం.

హేమంత్ సొరేన్ వాస్తవానికి డిగ్రీ పూర్తి చేయలేదు. రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతుండగానే తన అన్న మరణంతో అతను రాజకీయాల్లోకి ప్రవేశం చేయవలిసిన అవసరం ఏర్పడింది. ఆయన విద్యార్హత ఇంటర్ మాత్రమే. అలా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలుత అర్జున్ ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆ తరువాత జార్ఖండ్ అతి పిన్న వయసు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించాడు. హేమంత్ సొరేన్ భార్య కల్పన వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, మహిళా సాధికారత కోసం తన ఫౌండేషన్ల ద్వారా కృషి చేస్తుంది. ఆమె ఈ ఎన్నికల్లో ఎంతలా హేమంత్ సొరేన్ షెడ్యూల్ ని సెట్ చేసిందంటే ఏకంగా ఆమెపైన్నే అధికార బీజేపీ అవినీతి ఆరోపణలు చేసేంత. భర్త ఎన్నికల బాధ్యతలను బ్యాక్ గ్రౌండ్ లో అన్ని తానై చూసుకుంది.

హేమంత్ కల్పనలదీ లవ్ మ్యారేజ్ అని ప్రచారం సాగుతోంది. మెస్రాలోని ప్రఖ్యాత బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హేమంత్ బీటెక్ చదివే రోజుల్లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. అయితే వీరిరువురూ కూడా తమ వివాహం గురించి మీడియా ఎదుట ఎప్పుడు కూడా ప్రస్తావించకపోవడంతో వీరిది ఏ వివాహం అనేది ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా కల్పన ఇంటి బాధ్యతతోపాటు ఆదివాసీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోంది. తాజా ఎన్నికలకు ముందు హేమంత్ భార్య కల్పన సోరెన్ వార్తల్లో నిలిచింది.  గిరిజన చట్టాలను ఉల్లంఘించి కల్పన సోరెన్ ఈ జనవరిలో 60 ఎకరాల భూమిని కొనడం వివాదాస్పదమైంది. అధికారులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె మోసం చేసి ఈ భూములను లాక్కున్నారని విమర్శలు వచ్చాయి. ఈ కుంభకోణం అసెంబ్లీ లోనూ బీజేపీ నేతలు ప్రస్తావించి హేమంత్ సోరెన్ ను ఇరుకునపెట్టారు. ఈ ఎన్నికల్లో హేమంత్ భార్య భూ కుంభ కోణాన్ని ఎలుగెత్తి చాటారు బీజేపీ నాయకులు. అయినా బీజేపీ కి ఈ పరిణామం కలిసి రాలేదు. అయితే భూమి కొనుగోలు లో ఎలాంటి అక్రమాలు లేవని జేఎంఎం ఇదవరికే ప్రకటించింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అధికారంలోకి రావడానికి అతని భార్య రష్మి ఠాక్రే కీలక పాత్ర పోషించారని చాలామందికి తెలియదు. శివ సేన చీఫ్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించమని ప్రోత్సహించడం నుండి, కొడుకు ఆదిత్య ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేయడం వరకు, రష్మి ఠాక్రే శివసేన మైలురాళ్లపై తనదైన ముద్రను వేశారు.చిరకాల మిత్రపక్షమైన బిజెపితో సేన సంబంధాలను తెగదెంపులు వెనుక సూత్రధారి రష్మీ అని చాలా మందికి తెలియదు. సంవత్సరాలుగా, రష్మి ఠాక్రే పార్టీ కేడర్ తో నిరంతరం సంబందాలను కొనసాగిస్తున్నారు. శివసేన మహిళల విభాగం కార్యక్రమాల్లో  చురుకుగా నిమగ్నమై ఉన్నారు.

క్లాస్‌మేట్స్ నుండి సోల్‌మేట్స్ వరకు... ముంబై సమీపంలోని డొంబివిల్లి కి చెందిన రష్మి ఠాక్రే(అప్పుట్లో రష్మీ పతంకర్), మొదటగా ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. ఈ జంట ప్రయాణం క్లాస్‌మేట్స్‌గా ప్రారంభమైంది, తరువాత ప్రేమలో పడి, అది ముదిరి పాకాన పడ్డాక వీరిరువురు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో, ఇప్పుటి సేన చీఫ్ అప్పట్లో  రాజకీయాలోకి రావడానికి ఆసక్తి చూపలేదు.వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా తన మనసుకు నచ్చిన అభిరుచిని వృత్తిగా ఎంచుకోవడానికి సిద్ధమయ్యాడు. వారి వివాహం అయిన మొదటి రెండు సంవత్సరాలు, ఈ జంట వేరుగా  నివసించారు, ఆ తరువాత ఠాక్రేల నివాసం, మాతోశ్రీకి తిరిగి వెళ్లారు.

తొలినాళ్లలో ఉద్దవ్ ఠాక్రే ‘చౌరాంగ్’ అనే యాడ్ ఏజెన్సీని ప్రారంభించాడు.  కొంతకాలం తరువాత దాన్ని మూసివేసాడు. 40 సంవత్సరాల వయస్సులో, ఉద్ధవ్ ఠాక్రేను రాజకీయాల్లోకి వెళ్లాలని భార్య రష్మి ఠాక్రే ప్రేరేపించారు. శివసేన అధినేత బాల్ ఠాక్రే వారసత్వాన్ని వారసత్వంగా పొందే విషయంలో ఉద్ధవ్, రాజ్ ల మధ్య నడుస్తున్న వారసత్వ యుద్ధంలో,  ఉద్ధవ్  థాక్రేనే తన రాజకీయ వారసుడిగా బాల్ ఠాక్రే ప్రకటించడంలో రష్మీ పాత్ర చాలా కీలకం. ఈ ఫలితంగా రాజ్ ఠాక్రే కుటుంబాన్ని, పార్టీని విడిచిపెట్టి, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) ను ప్రారంభించారు.

తన తండ్రిలా కాకుండా, ఆదిత్య ఠాక్రే, 19 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్నికలలో పోటీ చేసిన మొదటి ఠాక్రే అయినా ఆదిత్య ఠాక్రే శివసేన యూత్ వింగ్ చీఫ్ గా కొనసాగుతున్నాడు. అతని తల్లి రష్మి ఠాక్రే తన కొడుకు ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. అతని ప్రచారానికి సంబంధించిన  కీలక నిర్ణయాలు అన్నీ ఆమె దగ్గరుండి తీసుకున్నారు.

రాజకీయ కార్యక్రమాలలో ఉద్ధవ్ ఠాక్రే తరచుగా భార్య రష్మి ఠాక్రేతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. రష్మీ ఠాక్రే అక్క కొడుకు వరుణ్ సర్దేశాయ్, పార్టీ సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత శివసేన ఐటి సెల్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. రాజకీయాల్లో ఆమె నేర్పుతో పాటు, ఆమెది  వ్యాపారంలో కూడా అందే వేసిన చేయి. ఆమె పేర పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆమె డైరెక్టర్ హోదాలో రెండు సంస్థలను నిర్వహిస్తున్నారు. సమ్వేద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సహయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలకు రష్మీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రెండు సంస్థలతోపాటు, ఆమె మరో మూడు వెంచర్లలో కూడా భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఎలోరియా సోలార్ ఎల్‌ఎల్‌పి  ఈ కంపెనీలో కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు రష్మి ఠాక్రే ఇక్కడ కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.  ఆహార ఉత్పత్తులు, పానీయాలను తయారు చేసే హైబిస్కస్ కంపెనీలో కూడా ఈమె కొడుకు ఆదిత్య ఠాక్రేతోపాటు భాగస్వామ్యం కలిగి ఉన్నారు. కోమో స్టాక్స్ అండ్ ప్రాపర్టీస్ అనే కంపెనీకి కూడా ఈ మీ కొడుకుతో కలిసి నిర్వహిస్తున్నారు. శివసైనికుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తానని తన భర్త తన మామకు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రష్మీ ఠాక్రే తీవ్రంగానే శ్రమించారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య కూడా దేవేంద్ర ఫడ్నవిస్ కి రాజకీయంగా చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆమె ఆక్సిస్ బ్యాంకు వైస్ చైర్మన్ గా కొనసాగుతూనే మహారాష్ట్ర రాజకీయాల్లో భర్తకు అనేక సలహాలిస్తూ కీ రోల్ ప్లే చేసారు.

వాస్తవానికి ఆమె ఒక క్లాసికల్ సింగర్. ఆమె పేరు మీరు గూగుల్ లో టైపు చేయగానే ఫస్ట్ మనకు సజెషన్స్ లో అమృత ఫడ్నవిస్ సాంగ్ అని రావడం ఆమె పాపులారిటీ ఎంతటిదో మనకు తెలియచెబుతుంది.

వీరిరువురిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. దేవేంద్ర ఫడ్నవిస్ తల్లి, అమృత తల్లి ఇద్దరు మంచి స్నేహితులు. నాగపూర్ లో ఉంటున్న సమయంలో వీరిరువురు కలిసేలా వారిద్దరూ తల్లులు ఏర్పాటు చేసారు. అలా వారిద్దరూ కలుసుకోవడం, ఆ తరువాత అది ప్రణయానికి దారి తీయడం అది ముదిరి త్వరగానే పెళ్లి కూడా చేసుకున్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ కి ఎంత పాపులారిటీ ఉందొ...ఆమెకు కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆమె తొలి నాళ్లలో తన భర్తను సర్ అని పిలిచేదట. ఇప్పుడు మాత్రం ప్రేమగా దేవేన్ అని పిలుస్తుందట. ఆమె మహారాష్ట్ర ఎన్నికల వేళ భర్త ప్రచార బాధ్యతలను పంచుకుంటూ వార్ రూమ్ ప్రణాళికలను రాత్రి పొద్దుపోయేవరకు రచించేది. ఆమె కేవలం ఇలా భర్తకు రాజకీయ సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా... మహిళల సశక్తీకరణ కోసం కృషి చేస్తుంది.

ఆసిడ్ దాడి బాధితులకు అండగా ఉంటూ వారికోసం మనోస్థైర్యాన్ని నింపుతూ ర్యాలీల్లో పాల్గొంటుంది. టెన్నిస్ ఆటకు విస్తృత ప్రచారం కల్పిస్తూ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమెపై ఒక సెల్ఫీ కాంట్రవర్సీ కూడా ఉంది. ఒక క్రూజ్ షిప్ పై ఆమె సెల్ఫీ కోసం భద్రత బలగాలు వద్దు అని వారిస్తున్నా... నౌక అంచుకు వెళ్లి సెల్ఫీ దిగింది. అప్పట్లో ఇది వివాదం అవడంతో ఆమె అలా ప్రవర్తించినందుకు చింతిస్తున్నట్టు తెలుపుతూ క్షమాపణలు చెప్పింది.

సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి సైతం అతని భార్య వెన్నంటి ఉంటూ ఆయనను నడిపిస్తుంది.

మిగిలినవారిలా కాకుండా ఈమె మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతూ.. పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసారు. భర్త, మామ ల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ఒక చెరగని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.  ఈ సారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. ఆమె కేవలం 12,000 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందారు. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఈమె భర్త ప్రతి నిర్ణయం వెనుక వెన్నంటి ఉండి వాటిని కార్యరూపం దాల్చేవరకు వదిలేవారు కాదు. ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులకు చదువు కోసం అఖిలేష్ హయాంలో అనేక నూతన కార్యక్రమాలను చేపట్టడంలో ఈమెది కీలక భాగస్వామ్యం.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే వీరిరువురిదీ ప్రేమ వివాహం. ఆస్ట్రేలియాలో విద్యనభ్యసించి లక్నో తిరిగి వచ్చిన అఖిలేష్ యాదవ్ కి లక్నో లో విద్యనభ్యసిస్తున్న డింపుల్ కనబడింది. ఆమె అప్పట్లో గుర్రపుస్వారీ చేసేది. ఆమె గుర్రపుస్వారీ చూసి అఖిలేష్ మనసు పారేసుకున్నాడట. వీరి కులాలు వెరవడంతో తొలుత ములాయం సింగ్ వీరి పెళ్ళికి ఒప్పుకోలేదట. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రాజకీయమంతా కులసమీకరణాల మీద మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాజపుట్ అయినా డింపుల్ ను పెళ్లి చేసుకోవడానికి ములాయం సింగ్ ససేమిరా ఒప్పుకోలేదట.

అప్పట్లో సమాజ్ వాది పార్టీలో నెంబర్ 2 గా కొనసాగిన అమర్ సింగ్ ములాయం సింగ్ యాదవ్ ను ఒప్పించాడట. అలా వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి తరువాత కొద్దీ రోజులు పిల్లల బాధ్యతలు నిర్వహించిన తరువాత డింపుల్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అక్కడ భర్తకు చేదోడు వాదోడుగా ఉండడం ఆరంభించింది. అక్కడి నుంచి పెళ్లయిన సరిగ్గా 10ఏండ్ల తరువాత లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యింది. కానీ ఆ తరువాత ఉత్తరప్రదేశ్ నుండి లోక్ సభ కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీగా ఆమె రికార్డు సృష్టించారు. రానున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మరోమారు భర్త అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించాలని ఇప్పటినుంచే కృషి మొదలుపెట్టింది.

జగన్ మోహన్ రెడ్డి- భారతి..పెళ్లి జరిగిన తరువాత జగన్ భార్య భారతి కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యింది. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యేవరకు జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో అంత ఆక్టివ్ కాదు. 2009లో తొలిసారి ఆయన కడప ఎంపీగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కూడా ఆమె ఎక్కువగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేవారు కాదు. ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లారో...పార్టీ ని నడిపించాల్సిన బాధ్యతను అత్త విజయమ్మ, ఆడపడుచు షర్మిలతో కలిసి పంచుకున్నారు.

ఆమె అప్పటివరకు కడపలో వైఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల నిర్వహణను మాత్రమే చూసుకునేవారు. ఆ తరువాత ఆమె పార్టీతో పాటు కుటుంబ వ్యాపారాలన్నింటిని అన్ని తానై చూసుకున్నారు. ముఖ్యంగా సాక్షి దినపత్రిక కార్యాలయాన్ని ఆమే నడిపించారు. దానిపై సిబిఐ రైడ్స్ జరిగినప్పుడు కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు మనోధైర్యాన్ని నూరిపోశారు. ఆమె ఇప్పటికి కూడా సాక్షి కార్యాలయానికి సంబంధించిన లావాదేవీలను చూసుకుంటుంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె జగన్ రాజకీయ షెడ్యూల్ కు ఎటువంటి భంగం కలగకుండా చాలా పనులను దగ్గరుండి చక్కబెట్టారు. ఎన్నికల స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీం తో పూర్తిగా సమన్వయం చేస్తూ ఆమె భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.

ఇక వీరిద్దరి వివాహం విషయానికి వస్తే వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. భారతి తల్లిదండ్రులిద్దరూ కూడా డాక్టర్లు. భారతి తల్లి సుగుణ రెడ్డి దివంగత రాజశేఖర్ రెడ్డి కి ఎంబీబీఎస్ చదివే రోజుల్లో క్లాస్ మేట్. ఆ పరిచయం వల్ల భారతి చదువు పూర్తవగానే వీరిరువురి వివాహం జరిగింది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?