న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికే కార్యక్రమానికి దూరమయ్యారు. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా ఇరు వర్గాలు ఘర్షణలకు దిగడంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

వాహనాలను, దుకాణాలను తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో ఓ పోలీసు కూడా మరణించాడు అల్లర్లలో ఐదుగురు మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. దాదాపు 100 మంది సోమవారం జరిగిన అల్లర్లలో గాయపడ్డారు. దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రుల్లో చేర్చారు. 

ఢిల్లీ పోలీసు చీఫ్, కేందర్ హోం శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఇంజన్ కు నిప్పటించడంతో ఫైర్ ఫైటర్స్ కూడా గాయపడ్డారు. ట్రంప్ దేశరాజధాని ఢిల్లీకి కొద్ది సేపట్లో చేరుకుంటారని అనగా హింస పెచ్చరిల్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో అమిత్ ట్రంప్ నకు స్వాగతం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. మంగళవారం ప్రభత్వ, ప్రైవేట్ కళాశాలలకు సెలవు ప్రకటించారు. 

Also Read: ఒకవైపు ట్రంప్ పర్యటన... మరో వైపు ఢిల్లీలో అల్లర్లు.. నలుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ లో మంగళవారం ఉదయం సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి దూరంగా ఉన్నారు.

ట్రంప్ పర్యటన నేపథ్యంలో కొన్ని దుష్టశక్తులు హింసకు పూనుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్ారు. అల్లర్లకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు