Rahul Gandhi: నేడు దేశంలో శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం,  గ‌ళాన్ని వినిపించ‌డం కూడా నేరంగా మారింద‌ని రాహుల్ గాంధీ అన్నారు.  దేశంలో నిరుద్యోం పెరుగుతున్న తీరును ప్ర‌స్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. 

Rahul Gandhi-Unemployment: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించారు. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. నియంత పాల‌న అంటూ మండిపడ్డారు. యువతను నిరుద్యోగులను చేస్తూ కోట్లాది కుటుంబాల ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోందన్నారు. నిరుద్యోగ యువ‌త ప‌లు డిమాండ్ల‌తో ఆందోళ‌న చేస్తున్న వీయోను ఆయ‌న పంచుకున్నారు. గత ఐదేళ్లలో 20 నుంచి 24 ఏళ్లలోపు యువతలో నిరుద్యోగిత రేటు రెండింతలు పెరిగిందని గతంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు.

బీజేపీ స‌ర్కారు నియంత పాల‌న.. 

‘ప్రశ్నలు అడగొద్దు, గొంతు ఎత్తొద్దు, శాంతియుతంగా నిరసన తెలపొద్దు, నవ భారతంలో హక్కులను కోరినందుకు అరెస్టులు జరుగుతాయి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. యువతను నిరుద్యోగులుగా చేస్తూ.. కోట్లాది కుటుంబాల ఆశలను వమ్ము చేస్తూ.. ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. 

Scroll to load tweet…


నిరుద్యోగంపై గతంలో లేవనెత్తిన ప్రశ్నలు

గత ఐదేళ్లలో 20 నుంచి 24 ఏళ్ల యువతలో నిరుద్యోగం రెట్టింపు అయ్యిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని అబద్ధాల కోసం దేశంలోని యువత "తప్పుదోవ పట్టించడం", "ద్రోహం" మరియు "వంచన" వంటి "అన్ పార్లమెంటరీ" పదాలను ఉపయోగించగలరా అని ప్రశ్నించారు. 2017-18 నుండి 2021-22 వరకు ఐదేళ్లలో నిరుద్యోగం రెట్టింపు అయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా గ్రాఫ్ ను కూడా ఆయ‌న పంచుకున్నారు.

నిరాశలో దేశం.. 

రాహుల్ గాంధీ జూలై 15న ట్వీట్ చేస్తూ.. ‘దేశం నిరాశలో ఉంది’ అని పేర్కొన్నారు. ఇవి మీ స్వంత మాటలు, మీరు కాదా ప్రధాని? ఆ సమయంలో ఎంత సందడి చేసేవారో, ఈరోజు రూపాయి విలువ పతనాన్ని చూసి అంత 'మౌనంగా' ఉన్నార‌ని పేర్కొన్నారు. 'అబ్కీ బార్ 80 పర్' హ్యాష్‌ట్యాగ్ తో రాహుల్ గాంధీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరుపై ప్రధాని మోడీపై ప్రశ్నలు లేవనెత్తారు.

Scroll to load tweet…