పక్కా ప్లాన్: సల్మాన్ ఖాన్ హత్యకు గ్యాంగస్టర్ రెక్కీ

First Published 10, Jun 2018, 9:30 AM IST
Arrested Gangster Was Planning To Kill Salman Khan
Highlights

హైదరాబాదులో ఇటీవల పట్టుబడిన గ్యాంగస్టర్ ,సంపత్ నెహ్రా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు పథక రచన చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

న్యూడిల్లీ: హైదరాబాదులో ఇటీవల పట్టుబడిన గ్యాంగస్టర్ ,సంపత్ నెహ్రా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు పథక రచన చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హర్యానా పోలీసులు హైదరాబాదులో పోలీసుల సహకారంలో ఇటీవల హైదరాబాదులో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

తన ప్లాన్ లో భాగంగా సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. సల్మాన్ ఇంటి ఫొటోలను, ఇంటికి వెళ్లే మార్గాలను మొబైల్ ద్వారా తీశాడు. 

కృష్ణజింక కేసులో సల్మాన్ ఖాన్ చంపుతామని బిష్టోయ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన సంపత్ నెహ్రా తన పథకాన్ని అమలు చేసి విదేశాలకు పారిపోవాలని అనుకున్నాడు. 

సంపత్ నెహ్రా షార్ప్ షూటర్. నెహ్రా రాజస్థాన్ కు చెందిన బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందినవాడు. సంపత్ నెహ్రాను ఈ నెల 6వ తేదీన పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ హత్యకు జరిగిన పథకాన్ని వమ్ము చేయగలిగారు.

loader