డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత కరుణా నిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 


డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత కరుణా నిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత కొంతకాలగా ఆమె ఐటీ రిటర్న్స్ చెల్లించలేదు. ఈ క్రమంలో అరెస్టు వారెంట్ జారీ చేశారు.

 కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కుమార్తె అంజుగసెల్వి 2009-10వ ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ రిటన్స్‌ దాఖలు చేయక పోవడంతో చెన్నై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆమెకు వ్యతిరేకంగా ఎగ్మూర్‌లోని అడిషనల్‌ చీఫ్‌ మ్యాజిస్ర్టేట్‌ కోర్డులో కేసు వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వలర్మతి బెయిల్‌పై విడుదల కాని విధంగా అంజుగసెల్వికి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.