పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తోందని.. లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లి ప్రియురాలని చంపిన ఆర్మీ అధికారి..
ఓ ఆర్మీ అధికారి తన ప్రియురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తానని చెప్పి హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో అతడు ఈ ఘోరానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.

పదే పదే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తోందని ఓ ఆర్మీ అధికారి తన ప్రియురాలిని దారుణంగా హతమార్చాడు. లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. అనంతరం డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేశాడు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.
‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ’ కథనం ప్రకారం.. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న 40 రామేందు ఉపాధ్యాయ్ ఇటీవల సిలిరిగి నుంచి డెహ్రాడూన్ కు ట్రాన్సఫర్ అయ్యాడు. అతడికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. కొంత కాలం కిందట ఓ డ్యాన్స్ బార్ లో తొలిసారిగా నేపాలీ సంతతికి చెందిన 30 ఏళ్ల శ్రేయా శర్మ అనే మహిళను కలిశాడు. అనతి కాలంలోనే వారి మధ్య స్నేహం చిగురించింది. తరువాత అది వివాహేతర వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
డెహ్రాడూన్ కు పరిచయమైన తరువాత కూడా సిటీలో ఆమెకు కోసం ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. అందులో శ్రేయాను ఉంచి తరచూ కలుస్తుండేవాడు. అయితే ఆమె కొంత కాలం నుంచి తనను పెళ్లి చేసుకోవాలని కోరుతోంది. కానీ రామేందుకు అప్పటికే వివాహమైంనదున.. దానిని తిరస్కరిస్తూ వస్తున్నాడు. ఇటీవల కాలం నుంచి ఆమె ఈ విషయంలో ఆర్మీ అధికారిపై ఒత్తిడి తీసుకొస్తోంది.
దీంతో విసిగిపోయిన రామేందు ఉపాధ్యాయ్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా ఆమెకు ఓ రెస్టారెంట్ లో మద్యం తాగించాడు. కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్లి వద్దామని ఆమెతో చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకుంది. దీంతో శనివారం రాత్రి శ్రేయా శర్మను నగర శివార్లలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారను పార్క్ చేసి దారుణంగా హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అందులో ఈ హత్య చేసింది రామెందు ఉపాధ్యాయ్ అని గుర్తించారు. దీంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు హత్యకు ఉపయోగించిన ఆయుధం, నేరానికి ఉపయోగించిన కారు, నేరం చేసిన సమయంలో ఉపాధ్యాయ్ ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ (సిటీ) సరితా దోభాల్ తెలిపారు.