శైలజ కాకుండా.. మరో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్

Army Major called one of his 3 girlfriends to inform he killed Shailza: Police
Highlights


ఈ మేజర్ మాములోడు కాదు

ఆర్మీ మేజర్ భార్య శైలజా ద్వివేది హత్య కేసు విచారణలో రోజుకో నిజం బయటకు వస్తోంది. శైలజ ద్వివేదిని అతి కిరాతకంగా హత్య చేసిన మరో మేజర్ నిఖిల్ హుడా గురించి పోలీసులకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి.

నిఖిల్  మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు అతనికి ఢిల్లీలోనే మరో ముగ్గురు గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని తేలింది. శైలజను హత్య చేసిన అనంతరం ఆర్మీ మేజర్ తన ముగ్గురు గాళ్‌ఫ్రెండ్స్ లలో ఒకరికి ఫోన్ చేసి విషయం చెప్పానని పోలీసుల ఇంటరాగేషన్ లో అంగీకరించాడు.

 భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళకు నిఖిల్ ఫోన్ చేసి తాను శైలజను హత్య చేశానని చెప్పగా...అబద్ధం చెబుతున్నాడని భావించి అతని ఫోన్ కాల్ ను డిస్ కనెక్ట్ చేసిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేజర్ హత్య గురించి చెప్పగా దీనిపై పోలీసులను అప్రమత్తం చేయాలనే ఆలోచన నిఖిల్  గర్ల్ ఫ్రెండ్ కు రాలేదని తేలింది. 

2015లో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరచిన మేజర్ నిఖిల్ గుర్తుతెలియని మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించి వారితో స్నేహం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులు తేల్చారు.

loader