తన భార్యను 120 మంది వ్యక్తులు అర్ధనగ్నంగా చేసి, కొట్టారని కాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని చేస్తున్న ప్రభాకరణ్ ఆరోపించారు. స్థానిక పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. 

తన భార్యకు ఘోర అవమానం జరిగిందని ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని కడవాసల్ గ్రామంలో కొందరు వ్యక్తులు తన భార్యను అర్ధ నగ్నంగా చేసి, దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన ప్రభాకరన్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో హవిల్దార్ హోదాలో కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు మంగళ్ ధిల్లాన్ కన్నుమూత

ప్రభాకరన్ మాట్లాడిన వీడియోను రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు. అందులో ఆర్మీ జవాన్ మాట్లాడుతూ.. ‘‘నా భార్య లీజుకు తీసుకున్న స్థలంలో దుకాణం నడుపుతోంది. ఆమెను 120 మంది వ్యక్తులు చితకబాది దుకాణంలోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి వినతిపత్రం పంపాను. ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీ సర్, దయచేసి సాయం చేయండి. నా కుటుంబంపై కత్తులతో దాడి చేసి బెదిరించారు. నా భార్యను అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. ’’ అని అన్నారు. కాగా.. ఆర్మీ జవాన్ ఆరోపణలపైకంధవాసల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరిపి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన అంతా ఓ ‘అతిశయోక్తి’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

పోలీసులు ఏం చెప్పారంటే ? 
ప్రభాకరన్ తన భార్య లీజుకు తీసుకొని దుకాణం నడుపుతోందని వీడియోలో చెప్పిన స్థలం రేణుగంబల్ ఆలయ పరిసరాల్లో ఉంది. ఈ దుకాణం కుమార్ అనే వ్యక్తికి చెందినది. అయితే దీనిని ప్రభాకరన్ మామ సెల్వమూర్తికి కుమార్ ఐదేళ్ల పాటు రూ.9.5 లక్షలకు లీజుకు ఇచ్చాడు. కొంత కాలం తరువాత కుమార్ మరణించాడు. దీంతో అతడి కుమారుడు రాము సెల్వమూర్తి దగ్గరకు వచ్చి, తన తండ్రి తీసుకున్న డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని, దుకాణాన్ని తమకు అప్పగించాలని కోరాడు. దీనికి సెల్వమూర్తి అంగీకరిస్తూ.. ఫిబ్రవరి 10వ తేదీన ఒప్పందంపై సంతకం చేశాడు.

స్వలింగ సంపర్కుల హక్కులకు మద్దతివ్వాలి - ప్రధాని మోడీకి ఇండో అమెరికన్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ విజ్ఞప్తి

కానీ తరువాత సెల్వమూర్తి మాట మార్చాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రాము డబ్బులు ఇచ్చేందుకు ఆ దుకాణం వద్దకు వెళ్లాడు. ఆ దుకాణంలో సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలు అక్కడే ఉన్నారు. కానీ వారు డబ్బులు తీసుకోకుండా గొడవ చేశారు. ఈ క్రమంలో జీవా కత్తితో రాము తలపై దాడి చేశాడు. ఈ గొడవను గమనించిన స్థానికులు రాముకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి దుకాణంలోని వస్తువులను బయటకు విసిరేశారు. కానీ ఈ గొడవ జరిగిన సమయంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నా.. వారిపై అక్కడున్న జనమెవరూ దాడి చేయలేదు. 

తరువాత క్షతగాత్రులతో పాటు ప్రభాకరన్ భార్య కూడా సాయంత్రం హాస్పిటల్ లో చేరింది. అయితే జవాన్ వీడియోలో చెబుతున్న విధంగా ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా ఇరువర్గాలపై కంధవాసల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. హవిల్దార్ ప్రభాకరన్ వాదనల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. ఈ గొడవలో ఆర్మీ జవాన్ భార్యపై దాడి జరగలేదని స్పష్టం చేశారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆర్మీ జవానుతో మాట్లాడి ఆయన భార్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జవాను కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. కాశ్మీర్ లో మన దేశానికి ధైర్యంగా సేవలందిస్తున్న హవిల్దార్, తిరువణ్ణామలైకి చెందిన ఆయన భార్యతో ఫోన్ లో మాట్లాడాను. నిజంగా ఆమె కథ విని చాలా బాధపడ్డాను. మన తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను.! వేలూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు మా పార్టీ వాళ్లు వెళ్తున్నారు’’అని అన్నామలై ట్వీట్ చేశారు.