సరిహద్దుల్లో జవాన్ కాపలా.. లైంగిక వేధింపులతో ఆయన భార్య ఆత్మహత్య

First Published 3, Aug 2018, 11:52 AM IST
Army jawan's wife alleges harassment, committs sucide
Highlights

వేధింపులు తీవ్రం కావడంతో ఆమె జీవితం మీద విరక్తిచెంది బుధవారం ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా తన ఆత్మహత్యకు సాయికృష్ణ వేధింపులే కారణమని మరణ వాంగ్మూలమచ్చింది.

ఓ కామాంధుడి లైంగిక వేధింపులు తాళలేక.. జవాన్ భార్య ఆత్మాహుతి చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని విజయపురలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...విజయపుర సమీపంలోని కొమ్మసంద్రకు చెందిన కవిత (35)కు విజయపుర పట్టణానికి చెందిన నటరాజు అనే  జవాన్‌తో  సుమారు 12 ఏళ్లక్రితం వివాహమైంది.

భర్త గౌహతిలో సైన్యంలో పనిచేస్తుంటే, ఆమె విజయపుర పట్టణంలోనే కొడుకుతో కలిసి నివసిస్తోంది. భర్త అప్పుడప్పుడు సెలవు మీద వచ్చి వెళ్తుండేవాడు. కవిత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతుండేవారు. ఈ క్రమంలో  సాయికృష్ణ అనే యువకుడు కొద్దిరోజులుగా కవితను ప్రేమిస్తున్నాను అని వేధించడం ప్రారంభించాడు. 

వేధింపులు తీవ్రం కావడంతో ఆమె జీవితం మీద విరక్తిచెంది బుధవారం ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా తన ఆత్మహత్యకు సాయికృష్ణ వేధింపులే కారణమని మరణ వాంగ్మూలమచ్చింది. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. పట్టణ పోలీసులు సాయికృష్ణను అరెస్ట్‌ చేశారు.  

loader