కారు హెడ్‌లైట్‌పై వాగ్వాదం... పోలీసు చెంపదెబ్బ కొట్టడంతో వ్యక్తి మృతి..
కారు హెడ్ లైట్స్ ఆఫ్ చేయమన్నందుకు ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడో జవాన్. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగ్ పూర్ లో వెలుగు చేసింది.

నాగ్‌పూర్ : నాగ్‌పూర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కారు హెడ్‌లైట్ విషయంలో జరిగిన వాదనలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్) జవాన్ ఓ 54 ఏళ్ల వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అతను మరణించాడని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడైన జవాన్ ను నిఖిల్ గుప్తా (30)గా గుర్తించారు. అతను తన సోదరిని చూసేందుకు వథోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతా మందిర్ ప్రాంతానికి వెళ్లే క్రమంలో గురువారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
గుప్తా తన కారును పార్క్ చేస్తున్నప్పుడు, కారు హెడ్‌లైట్ బీమ్ అదే ప్రాంతంలో నివసించే బాధితుడు మురళీధర్ రామ్‌రాజీ నెవేర్ ముఖంపై నేరుగా పడుతుందని అధికారి తెలిపారు. దీంతో బాధితుడు మురళీధర్ మర్యాదపూర్వకంగా నిందుతుడైన నిఖిల్ గుప్తాకు కారు హెడ్ లైట్ తగ్గించమని చెప్పాడు. కానీ, ఎస్సార్పీఎఫ్ జవాన్ కోపానికి వచ్చాడు. నాకే చెబుతావా అని విరుచుకుపడ్డాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.
‘బండిమీద చేయేస్తే.. నరికేస్తా...’ : సీ లింక్‌పై మహిళా బైకర్ హల్ చల్.. వీడియో వైరల్
వాదనతో ఆగ్రహానికి వచ్చిన గుప్తా.. నెవర్ ని గట్టిగా కొట్టడంతో నెవేర్ నేలమీద కుప్పకూలిపోయాడు. అతడిని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు గుప్తాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.