కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓ నెటిజన్ ఇరుకులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె పెళ్లి గురించి ప్రశ్నవేసి కేంద్రమంత్రి ఆగ్రహాన్ని చవిచూశారు. మీ ఫ్రెండ్ మోనా భర్తను మీరు పెళ్లి చేసుకున్నారా? అి స్మృతి ఇరానీని ఆ నెటిజన్ ప్రశ్నించాడు. ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నటిగా ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె జై బోలో తెలంగాణ సినిమాలోనూ నటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోనూ ఆమె షార్ప్‌గా ఉంటారు. ఘాటు వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. యూపీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ పై గట్టి విమర్శలు చేస్తుంటారు. ఇటీవలే పార్లమెంటులో రాహుల్ గాంధీపై ఆమె ఫైర్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఆమె చురుకుగా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ఫాలోవర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనుకున్నారు. అందుకే ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందులో చాలా ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు చెప్పారు. అయితే.. ఆమె పెళ్లి గురించి ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆమె ఒకింత సీరియస్ అయ్యారు.
రాజకీయ ప్రత్యర్థులూ ఆమె పెళ్లి గురించి పలుమార్లు కామెంట్లు చేశారు. స్మృతి ఇరానీ ఆమె ఫ్రెండ్ భర్తను బుట్టలో వేసుకుందని ప్రత్యర్థి పార్టీల క్యాడర్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా, ఇలాంటి ప్రశ్నే ఓ నెటిజన్ నేరుగా ఆమెనే ప్రశ్నించడంతో వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు.
మీ ఫ్రెండ్ మోనా భర్తను మీరు పెళ్లి చేసుకున్నారా? అనే ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇలా సమాధానం ఇచ్చారు. తన ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకోలేదని ఆమె అన్నారు. మోనా తన కంటే 13 ఏళ్ల పెద్దదని, కాబట్టి, ఆమె తన చిన్ననాటి ఫ్రెండ్ అయ్యే అవకాశమే లేదని తెలిపారు. మోనా రాజకీయ నాయకురాలు కాదని, కాబట్టి, ఆమెను ఇందులోకి లాగవద్దని సూచించారు. అవసరమైతే తనతో పోరాడాలని ,తనతో వాదించాలని ఆమె అన్నారు. తనను కించపరిచా సరే గానీ, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆమెను ఇందులోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమెను గౌరవించాలని సూచనలు చేశారు. ఈ వ్యవహారం వార్తలుగా ముందుకు వచ్చాయి.
Also Read: ప్రైవేట్ పార్టులకు గాయాలుంటేనే రేప్ జరిగినట్టా? లేకుంటే కాదా?: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
స్మృతి ఇరానీ భర్త పేరు జుబిన్ ఇరానీ. వీరు 2001లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు జోర్, ఒక కూతురు జోయిష్ ఉన్నారు. స్మృతి ఇరానీ కంటే ముందు జుబిన్ ఇరానీ, మోనా ఇరానీని పెళ్లి చేసుకున్నారు. జుబిన్ ఇరానీ, మోనా ఇరానీలకు ఒక కుమార్తె సంతానం ఉన్నది.
