బయటపడిన మహాభారత కాలం నాటి అవశేషాలు.. ఈ పుర్రెలు, కత్తులు ఏ రాజువో..?

Archaeological Survey of India founds monuments of Mahabharata era
Highlights

దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలోని అలనాటి హస్తినాపురానికి దగ్గరగా ఉన్న సనౌలీ అనే గ్రామంలో.. మహాభారతకాలం నాటి అవశేషాలు బయటపడ్డాయి.  ఆర్కియాలాజికల్  సర్వే ఆఫ్ ఇండియా గత జూన్‌ నుంచి చేపట్టిన తవ్వకాల్లో రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు లభించాయి. 

మహాభారతం.. దయాదుల పోరు.. ప్రాచీన భారత దేశ చరిత్రలో సమున్నత స్థానం సంపాదించుకున్న ఒక అధ్యాయం. వేల ఏళ్లు గడుస్తున్నా నేటీకి జనానికి స్పూర్తినిస్తున్న అద్భుత గాథ. ప్రాచీన గ్రంథాలలో, పుస్తకాలలో మాత్రమే ఉన్న మహాభారతానికి సంబంధించిన ఆధారాల కోసం పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలోని అలనాటి హస్తినాపురానికి దగ్గరగా ఉన్న సనౌలీ అనే గ్రామంలో.. మహాభారతకాలం నాటి అవశేషాలు బయటపడ్డాయి. ఆర్కియాలాజికల్  సర్వే ఆఫ్ ఇండియా గత జూన్‌ నుంచి చేపట్టిన తవ్వకాల్లో రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు లభించాయి. వీటిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపేందుకు గాను.. ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇవి అలనాటి రాచకుటుంబానికిన సంబంధించినవిగా తెలుస్తోంది. నాలుగువేల ఏళ్ల నాటి మొత్తం ఎనిమిది సమాధుల్లో తినుబంఢారాలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు దొరికాయి. గతంలో గ్రీస్, మెసొపొటేమియాల్లో మాత్రమే ఇలా రాతి రథాలు బయటపడగా.. దేశ పురావస్తు శాఖ తవ్వకాల్లో మాత్రం ఇదే తొలిసారి.

loader