Asianet News TeluguAsianet News Telugu

‘బాఫ్టా’ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌..

సంగీత దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ కు చెందిన బాప్టా సంస్థ ఇండియన్ అంబాసిడర్ గా రెహమాన్ ను నియమించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స(బాఫ్టా) సంస్థ ఆస్కార్‌ అవార్డుతో సమామైన అవార్డులను ప్రదానం చేస్తుంది. 

AR Rahman chosen as BAFTA Breakthrough India ambassador  - bsb
Author
Hyderabad, First Published Nov 30, 2020, 12:12 PM IST

సంగీత దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ కు చెందిన బాప్టా సంస్థ ఇండియన్ అంబాసిడర్ గా రెహమాన్ ను నియమించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స(బాఫ్టా) సంస్థ ఆస్కార్‌ అవార్డుతో సమామైన అవార్డులను ప్రదానం చేస్తుంది. 

ఈ సంస్థ తన ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ ను నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి బాఫ్టా, నెట్‌ఫ్లిక్స్‌ సాయంతో ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఐదు రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది. 

దీనిమీద ఏఆర్‌ రెహమాన్‌ సంతోషం వ్యక్తం చేశారు... ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించాలని ఉత్సాహంగా ఉంది..’ అని తెలిపారు.

ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను బాఫ్టా గుర్తించటం ఓ ప్రత్యేకమైన అవకాశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారి మధ్య సంబంధాలు పెంచడానికి కృషి చేస్తానన్నారు. బాఫ్టా అవార్డు విజేతలు, నామినేషన్‌ దక్కించుకున్న వాళ్లకు మెంటర్‌గా కూడా ఉంటానని పేర్కొన్నారు. 

ఈ అవకాశంతో భారత్‌లో ఉన్న అద్భుతమైన టాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నానన్నారు. యూకేలో బాఫ్టా 2013 నుంచి బ్రేక్‌ త్రూ ఆర్టిస్టులను  గుర్తిస్తోంది. అదేవిధంగా 2019 నుంచి చైనాలో ఉన్న కొత్త ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇక భారత్‌లో ఉన్న కొత్త టాలెంట్‌ను గుర్తించడానికి బాఫ్టా అడుగులు వేస్తోంది. 

ఏఆర్‌ రెహమాన్‌ బాఫ్టా అంబాసిడర్‌గా తమకు మద్దతుగా నిలిచినందుకు ఆనందంగా ఉందని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ అన్నారు.  హిందీ, తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలతో అనుబంధం ఉన్న రెహమాన్‌ సేవలు బాఫ్టాకు ఎంతగానో ఉయయోగపడతాయని పేర్కొన్నారు. బ్రేక్‌ త్రూ ఇండియా ఆర్టిస్టులను ఎంపిక చేయడం కోసం జ్యూరీ, న్యాయ నిర్ణేతలను నియామించాల్సి ఉందని బా​ఫ్టా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios