లోక్‌పాల్‌ను నియమిస్తారా..? లేదా..? కేంద్రంపై సుప్రీం సీరియస్

First Published 2, Jul 2018, 3:45 PM IST
Appoint Lokpal At The Earliest: Supreme court
Highlights

లోక్‌పాల్‌ను నియమిస్తారా..? లేదా..? కేంద్రంపై సుప్రీం సీరియస్

తమ తీర్పు వెలువరించి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు లోక్‌పాల్‌ను నియమించకపోవడంపై కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. లోక్‌పాల్ నియామకాన్ని తక్షణం చేపట్టాలంటూ గతేడాది సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏడాది కావొస్తున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేకపోవడంతో.. కామన్ కాజ్ అనే ఎన్జీవో సంస్థ సుప్రీంలో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్.భానుమతితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.. ఇందుకు 10 రోజుల గడువునిస్తూ.. తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. 

loader