Asianet News TeluguAsianet News Telugu

అడవిలో అస్థిపంజరం.. ఎవరిదని ఆరాతీస్తే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పనికి వెళ్లి మాయమయ్యాడు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరకలేదు.. నెలలు గడిచిపోయాయి. చివరికి ఆ తల్లిదండ్రులు 22యేళ్ల తమ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అడవిలో గుర్తు పట్టని స్థితిలో కనిపించిన తమ కొడుకును చూసి.. 
App cab driver skeleton found 4 months of his missing in jharkhand
Author
Hyderabad, First Published Nov 25, 2021, 10:02 AM IST

జంషెడ్‌పూర్ : జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలోని అడవిలో పోలీసులు ఓ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఇది దాదాపు నాలుగు నెలల క్రితం అదృశ్యమైన యాప్ క్యాబ్ డ్రైవర్‌దిగా అనుమానిస్తున్నారు. బుధవారం ఈ  అస్థిపంజరాన్ని పోలీసులు అడవిలో స్వాధీనం చేసుకున్నారు.

cab driverగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పనికి వెళ్లి మాయమయ్యాడు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరకలేదు.. నెలలు గడిచిపోయాయి. చివరికి ఆ తల్లిదండ్రులు 22యేళ్ల తమ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. ఎలాంటి కక్షలు, పగలు కాకుండా కేవలం కొంతమంది స్వార్థానికి తమకు కడుపుకోత మిగలడంతో తట్టుకోలేకపోతున్నారు.

ఆగస్ట్ 2న రాహుల్ శ్రీవాస్తవ్ (22) అనే వ్యక్తి పని నిమిత్తం బైటికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో  family members అదే రోజు MGM పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్టును నమోదు చేశారు. దీంతో పోలీసులు అక్టోబర్ 3న IPC సెక్షన్ 365 (ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిని కిడ్నాప్ చేయడం లేదా అపహరించడం లేదా తప్పుగా నిర్బంధించడానికి) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును గుర్తు తెలియని వ్యక్తులపై నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్-కమ్-ఆఫీసర్-ఇన్-ఛార్జ్ మిథిలేష్ కుమార్ తెలిపారు.

మార్చురీ గదిలో ప్రాణాలతో లేచిన మనిషి.. ట్రీట్‌మెంట్‌ పొందుతూ మరణం

missing case నమోదైనప్పటినుంచి పోలీసులు ఈ కేసును సాల్వ్ చేయడానికి కావాల్సిన క్లూల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ మంగళవారం ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో Suspectsగా అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల  సుధీర్ కుమార్ శర్మను అనుమానితుడిగా  గుర్తించి.. అతనితో పాటు అతని సహచరుడు రవీంద్ర మహతో (21)ను కూడా  Police investigation కోసం అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు అనుమానించినట్లే వీరివద్ద కనిపించకుండా పోయిన శ్రీవాస్తవ్ Mobile phone కూడా శర్మ వద్ద ఉన్నట్లు గుర్తించారు.. ఈ మేరకు పోలీసు అధికారి తెలిపారు. ఇవక వీరిని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా.. నిందితులు షాకింగ్ విషయాలు తెలిపారు. నిందితులకు శ్రీవాస్తవ్ తో ఎలాంటి గొడవలూ లేవు. వారు కేవలం డబ్బుల కోసం Theft చేయాలనుకున్నారు.

carను దొంగిలించాలన్న ఉద్దేశంతోనే శ్రీవాస్తవ్ ను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీనికోసం జిల్లాలోని చండిల్ డ్యామ్ సమీపంలోకి వెళ్లిన తరువాత రాళ్లతో తలపై కొట్టి App Cab Driver‌ శ్రీవాస్తవ్ ను హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించారని పోలీసులు తెలిపారు.

హత్యానంతరం dead bodyని అడవిలో వదిలేసి, కారు, మొబైల్‌ లతో పరారయ్యారు. వారి వాంగ్మూలం ఆధారంగా, పోలీసుల బృందం అడవి నుండి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుంది, కారు కూడా కనుపెట్టామని అధికారి తెలిపారు. నిందితులను 
Judicial custodyకి పంపించామని.. నిందితులు వాహనాన్ని ఎవరికైతే అమ్మాలనుకున్నారో వారి నుండి ముందస్తుగానే డబ్బులు చెల్లింపు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios