మార్చురీ గదిలో ప్రాణాలతో లేచిన మనిషి.. ట్రీట్‌మెంట్‌ పొందుతూ మరణం

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో గత గురువారం ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ శ్రీకేష్‌ను హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే మరణించాడని మార్చురీ గదికి తరలించారు. సుమారు ఏడు గంటల పాటు ఫ్రీజర్‌లో ఉన్న తర్వాత ఉదయం ఆయన బతికే ఉన్నట్టు గుర్తించారు. చికిత్స అందించారు. కానీ, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించినట్టు హాస్పిటల్ అధికారులు వెల్లడించారు.
 

UP Man who found alive dies while treating

లక్నో: ఓ Accidentతో తీవ్రంగా గాయపడి Hospitalకు చేరగానే మరణించాడని(Died) వైద్యులు ధ్రువీకరించడంతో ఆయన బాడీని మార్చురీ(Morgue)కి షిఫ్ట్ చేశారు. అదే రోజు రాత్రి ఫ్రీజర్‌లో పెట్టారు. సుమారు ఏడు గంటల తర్వాత ఉదయం పోస్టు మార్టం చేయడానికి తీయగా.. బతికే ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటన సంచలనాన్ని రేపింది. వైద్యులు కూడా ధ్రువీకరిస్తూ అతను బతికే ఉన్నాడనీ, అయితే, కోమాలో ఉన్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి చికిత్స మొదలైంది. కానీ, చికిత్స పొందుతున్నప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితులు విషమించి మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఆయన మరణించినట్టు మొరదాబాద్ జిల్లా హాస్పిటల్ అధికారులు తాజాగా వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో 45 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ శ్రీకేష్‌ను వేగంగా వెళ్తున్న ఓ బైక్ గురువారం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో నేలపై కూలిపోయాడు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పేషెంట్‌ను పరీక్షించారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్టు తేల్చారు. అనంతరం బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించాల్సిందిగా సూచించారు. గురువారం రాత్రే బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాడీని అతిశీతలమైన ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్ చేరుకున్నారు. బాడీని ధ్రువీకరించి పోస్టుమార్టం కోసం అనుమతి ఇచ్చే పత్రాలపై ఆ కుటుంబం సంతకం పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు బాడీలో కదలికలను గుర్తించారు. ఫ్రీజర్‌లో సుమారు ఏడు గంటలు ఉంచిన తర్వాత కూడా బాడీలో కదలికలు కనిపించాయి. 

Also Read: యాక్సిడెంట్‌లో ‘మరణించి’.. మార్చురీలో బతికాడు.. ఉత్తరప్రదేశ్‌లో ‘మిరాకిల్’

శ్రీకేష్ కుటుంబ సభ్యురాలు ఒకరు ఉద్వేగంతో అరిచారు. ఆయన ఇంకా చనిపోలేదని కేక వేశారు. ఆయన మరణిస్తే ఈ కదలికలు ఎలా సాధ్యమంటూ అడిగింది. ఆయన ఏమో చెప్పాలనుకుంటున్నాడని అన్నది. అంతేకాదు, ఇంకా ఆయన శ్వాస తీసుకుంటున్నాడని వివరించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్క సారిగా ఖంగుతిన్నారు. వెంటనే వైద్యులు పరుగున వచ్చారు. ఆయన బతికే ఉన్నాడని వైద్యులు చెప్పారు.

మొరదాబాద్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ్ సింగ్ మాట్లాడుతూ, తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ మెడికల్ అధికారి ఆ పేషెంట్‌ను పరీక్షించాడని, కానీ, ఆయనలో హార్ట్ బీట్ లేదని పేర్కొన్నారు. చాలా సార్లు ఆయనను పరీక్షించాడని వివరించారు. ఆ తర్వాతే ఆయన మరణించినట్టు ధ్రువీకరించాడని అన్నారు. కానీ, ఈ రోజు ఉదయం ఆ వ్యక్తి బతికి ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారని చెప్పారు. దీనికి సంబంధించి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయని వివరించారు. ఆ వ్యక్తిని కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Also Read: గతజన్మ గుర్తొచ్చింది.. ఆదివారాలు ఆఫీసుకు రాలేను.. ఇంజనీర్ లీవ్ అప్లికేషన్.. దిమ్మదిరిగే రిప్లై ఇదే

తాజాగా.. అదే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మంగళవారం సాయంత్రమే మరణించాడని, ఆరోగ్య శాఖ ఈ మొత్తం ఎపిసోడ్‌లో దర్యాప్తు చేస్తున్నదని వివరించారు. మార్చురీలో మళ్లీ ప్రాణాలతో ఆ వ్యక్తి కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios