జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బ్రాహ్మిణ్, బనియా కమ్యూనిటీలకు వ్యతిరేకంగా గోడలపై నినాదాలు కనిపించాయి. వీసీ వెంటనే రియాక్ట్ అయ్యారు. క్యాంపస్‌లో హింసను ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దర్యాప్తు చేసి రిపోర్ట్ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి వార్తల్లోకి ఎక్కింది. యూనివర్సిటీలోని పలు గోడలు, ఫ్యాకల్టీ గదులపై కొందరు దుండగులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు రాశారు. బ్రాహ్మణ, బనియా కమ్యూనిటీలకు వ్యతిరేకంగా నినాదాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కడంతో కలకలం రేగింది. ఈ ఉదంతంపై జేఎన్‌యూ వైస్ చాన్సిలర్ స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. వర్సిటీలో ఎలాంటి హింసను ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై విచారించి వెంటనే రిపోర్టు సమర్పించాని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, గ్రీవెన్సెస్ కమిటీ డీన్‌కు వీసీ శాంతిశ్రీ పండిట్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

గో బ్యాక్ టు శాఖా, బ్రాహ్మిణ్స్ వెంటనే క్యాంపస్ వదిలిపెట్టాలి, బ్రాహ్మిణ్స్-బనియా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాం మేం, దేర్ విల్ బీ బ్లడ్ వంటి నినాదాల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

Scroll to load tweet…

ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని విద్యార్థులు, టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది వామపక్ష గూండాల పని అని ఆర్ఎస్ఎస్ అనుబంధ స్టూడెంట్ యూనియన్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆరోపణలు చేసింది. ఇంటర్నేషనల్ స్టడీస్-II బిల్డింగ్ పై కమ్యూనిస్టులే ఈ రాతలు రాశారని పేర్కొంది. ఫ్రీ థింకింగ్ ప్రొఫెసర్లను బెదిరించడానికే వారి చాంబర్లపైనా రాతలు రాశారని ఆరోపించింది.

Scroll to load tweet…

Also Read: Violence in JNU: జేఎన్‌యూలో విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. పలువురికి తీవ్ర గాయాలు.. అస‌లేం జ‌రిగిందంటే?!

ఇప్పటికే జేఎన్‌యూలో పలుమార్లు వామపక్ష స్టూడెంట్ యూనియన్లు, ఏబీవీపీలకు మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.