తమిళనాడులో మరో నీట్ ఆత్మహత్య చోటుచేసుకుంది. నాలుగోసారీ తాను నీట్ పరీక్షలో తప్పేలా ఉన్నాననే భయంతో పురుగుల మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చెన్నై: Tamil Naduలో మరో NEET ఆత్మహత్య చోటుచేసుకుంది. 20ఏళ్ల విద్యార్థి తాను నాలుగోసారీ నీట్ పరీక్షను క్లియర్ చేయలేననే భయంతో ఫలితాలకు ముందే ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా, విడుదలైన Answer Key పేపర్‌ను విద్యార్థి పరిశీలించారు. అనంతరం ఈ పరీక్షనూ తాను తప్పుతారనే భయంతో ఆత్మన్యూనతలోకి జారిపోయారు. అనంతరం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Coimbatore జిల్లా సంగరాయపురానికి చెందిన కీర్తివాసన్ నాలుగు ఇది వరకే మూడు సార్లు నీట్ రాసి తప్పారు. చివరిసారిగా ఈ ఏడాది కూడా నాలుగోసారి నీట్ రాశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్ష రాశారు. ఫలితాల కోసం భయంగానే ఎదురుచూశారు. ఇటీవలే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆన్సర్ కీని విడుదల చేసింది. వాటిని పరిశీలించారు. ఈ పరీక్షలోనూ తాను తప్పుతారనే భయపడ్డారు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకూ చెప్పారు. పరీక్షలో ప్రశ్నలు చాలా డిఫికల్ట్‌గా వచ్చాయని బెంగపడ్డారు. ఈ పరీక్ష కూడా తాను క్లియర్ చేయలేనేమోనని వాపోయారు. అయితే, Results వచ్చే వరకు వేచి చూడమని తల్లిదండ్రులు ఆయనకు సూచించారు.
కానీ, జీవితంపై ఆందోళన, ఆత్మన్యూనతతో కీర్తివాసన్ శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తీసుకున్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే పొల్లాచి గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనను కోయంబత్తూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు పేషెంట్‌ను కోయంబత్తూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ హాస్పిటల్ పోస్టుమార్టం నిర్వహిస్తున్నది.
Also Read: మా రాష్ట్ర విద్యార్థులకు ‘నీట్’ పరీక్ష వద్దు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
నీట్‌కు సంబంధించి ఈ ఏడాది తమిళనాడులో జరిగిన ఐదో Suicide ఇది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరగడానికి ముందు ఐదు రోజుల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.
సేలం విద్యార్థి ధనుశ్ పరీక్షకు ఒక రోజు ముందే ఆత్మహత్య చేసుకున్నారు. మూడోసారి తాను నీట్ క్లియర్ చేయలేనేమోననే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్ పరీక్షపై తీవ్ర వ్యతిరకతను ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఈ మెడికల్ ఎగ్జామ్ క్రాక్ చేయలేక లేదా పరీక్ష రాసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏకే రాజన్ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది.
ఈ నీట్ పరీక్ష రాష్ట్రాన్ని స్వాతంత్ర్యానికి పూర్వస్థితికి తీసుకెళ్లే ముప్పు ఉన్నదని జస్టిస్ ఏకే రాజన్ కమిటీ పేర్కొంది. కాబట్టి, చట్టబద్ధంగానే ఈ నీట్ పరీక్షను అన్ని స్థాయిల్లో రాష్ట్రంలో తొలగించాల్సిందిగా సూచనలు చేసింది. నీట్ తొలగింపుతో సామాజిక న్యాయం, అణగారిన వర్గాల విద్యార్థులకు న్యాయం చేకూరుతుందని అభిప్రాయపడింది. మెడికల్ కోర్సుల్లో వివక్ష లేకుండా చేసినట్టవుతుందని తెలిపింది.
Also Read: తమిళనాడులో నీట్‌కు మరొకరు బలి: ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్.. ‘‘ నీట్ ’’ రిజల్ట్‌పై బెంగ, సరిగా రాయలేదని
నీట్ పరీక్షపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా వ్యతిరేకత చూపించారు. తమ రాష్ట్రాన్ని నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో నుంచి నీట్ అన్ని స్థాయిల్లోనూ తొలగించాలని ఆ లేఖలో కోరారు.
