Shillong: కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఆంప్రిన్ లింగ్డో తన రాజీనామా పత్రాన్నిఆదివారం నాడు కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపారు. తాజాగా ఎన్పీపీలో చేరిన చేరిన తర్వాత ఆయనకు అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. 

Meghalaya Congress: మేఘాలయకు చెందిన ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆంప్రిన్ లింగ్డో, మొహేంద్రో రాప్‌సాంగ్ సోమవారం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా కూడా పాల్గొన్నారు. వీరింగ్‌హెప్‌లో జరిగిన కార్యక్రమంలో సంగ్మా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో పాటు యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (ఎండీసీ) సభ్యుడు ఎమ్లాంకీ లామారే కూడా ఎన్పీపీలో చేరారు. ఇంతమంది పార్టీలో చేరడంతో ఎన్‌పీపీ బలం బాగా పెరిగింది. విశేషమేమిటంటే, ఆంప్రీన్ తన రాజీనామాను నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపారు. అలాగే, ఎన్పీపీలో చేరిన వెంట‌నే ఆయ‌న‌కు ఆ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. దీనితో పాటు ఎన్పీపీ విడుదల చేసిన ఆరుగురు వ్యక్తుల జాబితాలో అంపరిన్ పేరు కూడా ఉంది.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా, ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అంపరీన్ లింగ్డో, మొహింద్రో రాప్‌సాంగ్‌లు ఈరోజు స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలను సమర్పించినట్లు అసెంబ్లీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఫిబ్రవరిలో ఎన్పీపీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎమ్డీఏ)కి మరో ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు లింగ్డో, రాప్‌సాంగ్ మద్దతు ప్రకటించిన తర్వాత సస్పెండ్ చేశారు. అదే సమయంలో పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీకి మారారు. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప‌లువురు నేత‌లు వీడుతుండ‌టం ఆ పార్టీని దెబ్బ‌తీసే అవ‌కాశం కనిపిస్తున్న‌ది.

Scroll to load tweet…
Scroll to load tweet…

పార్టీ దిశా నిర్దేశం కోల్పోయిందనీ, ఆత్మపరిశీలనకు దారితీసే తీవ్రమైన, నిజాయితీ ప్రయత్నాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ను వీడిన నాయ‌కులు ఆరోపించారు. 2018 ఎన్నికల్లో తూర్పు షిల్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థిని ఓడించిన మంత్రి అంపరీన్ లింగ్డో, సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మొహేంద్రో రాప్సాంగ్ తరువాత అధికారికంగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి) లో చేరారు. ఐదు పార్టీల మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండిఎ) ప్రభుత్వానికి ఎన్పీపీ నాయకత్వం వహిస్తుంది. దీనిలో బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలతో చిన్న మిత్రపక్షంగా ఉంది. "పార్టీలో ఇటీవలి పరిణామాలు పార్టీ తన దిశా నిర్దేశాన్ని కోల్పోయిందని నేను నమ్ముతున్నాను. దీనిపై పార్టీ, దాని నాయకత్వం ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. ఆత్మపరిశీలనకు నాయకత్వం వహించడానికి చిత్తశుద్ధితో, నిజాయితీగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని నేను నమ్ముతున్నాను" అని 57 ఏళ్ల లింగ్డో సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.