ఢిల్లీలో మరో రోడ్డు ప్రమాదం.. కారు వేగంగా ఢీకొట్టడంతో ఐఐటీ రీసెర్చ్ స్టూడెంట్ మృతి, మరొకరికి గాయాలు
ఢిల్లీలో ఐఐటీ రీసెర్చ్ స్టూడెంట్ ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన ఆ యువకుడు హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే మరణించాడు. ఈ ఘటనలో మరో స్టూడెంట్ కు కూడా గాయాలు అయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కంఝవాలా ప్రమాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అలాంటి రోడ్డు ప్రమాదమే తాజాగా దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సమీపంలో కారు ఢీకొనడంతో 30 ఏళ్ల పరిశోధక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అష్రఫ్ నవాజ్ ఖాన్, అంకుర్ శుఖ్లా ఐఐటీలో పీహెచ్ డీ చదువుతున్నారు. పక్కనే ఉన్న ఎస్‌డీఏ మార్కెట్‌లో మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని నడుచుకుంటూ ఐఐటీ క్యాంపస్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
తిడుతున్నదని రైఫిల్ లో కాల్చి.. కన్నతల్లి ప్రాణాలు తీసిన యువకుడు..
క్షతగాత్రులు ఇద్దరినీ స్థానికులు సాకేత్‌లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ ఆలోపే అష్రఫ్ నవాజ్ ఖాన్ మరణించారని డాక్టర్లు ప్రకటించారు. అయితే అంకుర్‌కు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే నిందితులు కారును వదిలేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను గుర్తించామని, అతడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది మొదటి రోజున ఢిల్లీలో అంజలిసంగ్ అనే యువతి స్కూటీపై వెళ్తున్న సమయంలో ఓ కారు ఢీకొట్టింది. అనంతరం ఆమెను కారు సుమారు 12 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. సుల్తాన్ పూర్ నుంచి కంఝవాలా వరకు ఆమెను కారు నడుపుతున్న నిందితులు ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అంజలి స్నేహితులు నిధికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ కేసులో ఈనెల 2వ తేదీన దీపక్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులను జ్యూడిషీయల్ కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పలువురు పోలీసులపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. 11 మంది పోలీసులను సస్పెండ్ చేసింది.
బీజేపీ వీఐపీ ఆకతాయిలు : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరిచింది తేజస్వి సూర్యనే.. కాంగ్రెస్
అదే రోజు రాత్రి యూపీలోని నోయిడాలో డెలివరీ బాయ్ టూ వీలర్ ను ఢీకొట్టింది. అతడిని కూడా 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. అలాగే జనవరి 7వ తేదీన యూపీలోని కొత్వాలి నగరం హర్దోయ్‌లో 15 ఏళ్ల కేతన్‌కుమార్ ను ఓ కారు ఢీట్టింది. బాధితుడిని 15 కిలో మీటర్లు లాక్కెళ్లింది. బాధితుడు కేతన్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే తన సైకిల్ 7వ తేదీన కూడా కోచింగ్ క్లాస్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ తెల్లటి వ్యాగన్‌ఆర్ అతడి సైకిల్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడి కాలు కారు వెనకాల భాగంలో చిక్కుకుపోయింది.
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగరా.. నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
అయితే దీనిని కారులో ఉన్న వ్యక్తులు గమనించినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. స్థానికులు కారు ఆపాలని ఎంతగా అరిచినా కూడా వారు వినలేదు. బాలుడిని ఈడ్చుకుంటూనే వెళ్లిపోయారు. దీంతో కేతన్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానికులు సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.