ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ముండ్కాలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని నరేలాలోని ప్లాస్టిక్ గ్రాన్యులేషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ఫ్యాక్టరీలో మొత్తం మంటలు ఆవరించాయి. దీనిని ఆపేందుకు 22 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం. ఈ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో ఎవరూ చిక్కుకోలేదు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో రాత్రి 9.10 గంటలకు అగ్నిప్రమాదం ప్రమాదం సంభవించిందని తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖ ఎస్కే దువా తెలిపారు.
‘‘ అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది మీడియం కేటగిరీ అగ్నిప్రమాదంగా ప్రకటించారు. ఘటనా స్థలంలో 22 అగ్నిమాపక ఇంజన్లు ఉన్నాయి. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు’’ అని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో తెలిపారు. కాగా ముండ్కాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది మరణించిన ఒక రోజు తరువాత ఇది జరిగింది. ఆ ప్రమాదంలో 30 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.
ముండ్కా ప్రమాదంలో 50 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించిన ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కాగా శనివారం మధ్యాహ్నం రైడా పంజాబ్‌లోని ఆధ్యాత్మిక పట్టణం అమృత్‌సర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో పగటిపూట ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఓపీడీ సమీపంలో పెద్ద పేలుడు సంభవించడంతో సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అది స్కిన్ , కార్డియాలజీ వార్డుకు కూడా వ్యాపించింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Asaduddin Owaisi: 'మరో మసీదు కోల్పోవడానికి సిద్దంగా లేం..' : AIMIM చీఫ్
‘‘ ఓపీడీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి’’ అని ఆసుపత్రి ప్రిన్సిపల్ తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ గాయాలు కానీ కాలేదని ఆయన వెల్లడించారు. అయితే ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో దాదాపు వెయ్యి లీటర్ల నూనె వుంటుంది. తీవ్రమైన వేడి కారణంగా వాటిలో ఒక్కోసారి మంటలు చెలరేగుతూ వుంటాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
