Asianet News TeluguAsianet News Telugu

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పై మ‌రో అవినీతి కేసు.. సోదాలు నిర్వ‌హిస్తున్న సీబీఐ

లాాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ తాజాాగా మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా నేడు లాలూ నివాసంపై, ఆయన కుటుంబ సభ్యులపై నివాసాలపై సోదాలు నిర్వహిస్తోంది. 

Another corruption case against Lalu Prasad Yadav .. CBI conducting investigations
Author
New Delhi, First Published May 20, 2022, 8:35 AM IST

దాణా కుంభకోణం కేసులో బెయిల్‌ పొందిన కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇంటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు నిర్వ‌హిస్తోంది. ఆయ‌న బీహార్ సీఎంగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ ఆయ‌న‌పై తాజాగా అభియోగాలు మోపింది. ఈ కేసులోనే ఇప్పుడు సోదాలు జ‌రుగుతున్నాయి. 

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో పాటు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా ఈ కొత్త కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సీబీఐ ఈరోజు రాష్ట్రీయ జనతాదళ్ అధినాయ‌కుడికి సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు ప్రారంభించింది. ఇందులో ఆయ‌న నివాసం కూడా ఉంది. 

రూ. 139 కోట్ల డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత 73 సీనియ‌ర్ నాయకుడు గత నెలలో జైలు నుండి బయటకు వచ్చారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయ‌న‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 60 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ట్రెజరీ కుంభకోణం కేసు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను దోషిగా నిర్ధారించిన ఐదో కేసు.

Follow Us:
Download App:
  • android
  • ios