Asianet News Telugu

బాలల అశ్లీల కంటెంట్.. మరో వివాదంలో ట్విట్టర్, కేసు నమోదు

భారత్‌లో ట్విట్టర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజంపై మరో కేసు నమోదైంది. ట్విట్టర్‌పై ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్విట్టర్‌లో బాలల అశ్లీల కంటెంట్ ఉంటోందని ఎన్‌సీపీఆర్ ఫిర్యాదు చేసింది. 

another case filed on twitter over child porn ksp
Author
New Delhi, First Published Jun 29, 2021, 5:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత్‌లో ట్విట్టర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజంపై మరో కేసు నమోదైంది. ట్విట్టర్‌పై ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్విట్టర్‌లో బాలల అశ్లీల కంటెంట్ ఉంటోందని ఎన్‌సీపీఆర్ ఫిర్యాదు చేసింది. 

కాగా, జమ్మూకాశ్మీర్ , లడ్డాఖ్ లను వేరే దేశంగా చూపిన ట్విట్టర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై  ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుజ్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషయమై  భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ అమృతా త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read:ఇండియా మ్యాప్ వివాదం: ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు

జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ లను  ఇండియాలో అంతర్భాగంగా కాకుండా వేరే దేశంగా తమ వెబ్‌సైట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం ఈ మ్యాపుపై సీరియస్ అయింది. దీంతో ఈ మ్యాప్ ను ట్విట్టర్ తొలగించింది.కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయలేదు. అంతేకాదు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకుగాను  ఘజియాబాద్  పోలీసులు ట్విట్టర్ ఎండీపై గతంలో కేసు నమోదు చేశారు.

ఈ విషయమై వివరణ ఇవ్వాలని కూడ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో కర్ణాటక హైకోర్టును ఆయన ఆశ్రయించారు. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.కొత్త ఐటీ రూల్స్ విషయంలో   ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు  ట్విట్టర ప్రతినిధులు హాజరయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios