జమ్మూకాశ్మీర్ , లడ్డాఖ్ లను వేరే దేశంగా చూపిన ట్విట్టర్ పై కేసు నమోదైంది. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై  ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ:జమ్మూకాశ్మీర్ , లడ్డాఖ్ లను వేరే దేశంగా చూపిన ట్విట్టర్ పై కేసు నమోదైంది. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుజ్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషయమై భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ అమృతా త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.


జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ లను ఇండియాలో అంతర్భాగంగా కాకుండా వేరే దేశంగా తమ వెబ్‌సైట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం ఈ మ్యాపుపై సీరియస్ అయింది. దీంతో ఈ మ్యాప్ ను ట్విట్టర్ తొలగించింది.కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయలేదు. అంతేకాదు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకుగాను ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ ఎండీపై గతంలో కేసు నమోదు చేశారు

also read:మరో దేశంగా కాశ్మీర్, లడ్డాఖ్: మరోసారి బరితెగించిన ట్విట్టర్

.ఈ విషయమై వివరణ ఇవ్వాలని కూడ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో కర్ణాటక హైకోర్టును ఆయన ఆశ్రయించారు. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.కొత్త ఐటీ రూల్స్ విషయంలో ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర ప్రతినిధులు హాజరయ్యారు.