Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీపై మరో కేసు.. ‘21వ శతాబ్దపు కౌరవులు’ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా దాఖలైంది. ఉత్తరాఖండ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది కమల్ భదౌరియా ఈ కేసును దాఖలు  చేశారు. భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై వ్యాఖ్యలు చేశారని, అవి తనను బాధించాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. 

Another case against Rahul Gandhi.. RSS worker files defamation suit over '21st century Kauravas' comments..ISR
Author
First Published Apr 1, 2023, 4:46 PM IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ‘మోడీ ఇంటి పేరు’ వ్యాఖ్యల కేసులో దోషిగా తేలడంతో ఆయన తన లోకసభ సభ్యత్వానికి అర్హత కోల్పోయారు. రెండు రోజుల కిందట ఇవే వ్యాఖ్యలపై పాట్నా కోర్టులో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ క్రిమినల్ పరువునష్టం అభియోగాలు మోపారు. దీంతో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులతోనే సతమవుతున్న ఆయనపై మరో పరువునష్టం దావా దాఖలైంది.

లవర్ చీట్ చేశాడు.. రద్దీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన యువతి.. వైరల్ వీడియో ఇదే

‘ఆర్ ఎస్ఎస్ 21వ శతాబ్దపు కౌరవులు’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఈ కేసును దాఖలు చేశారని, దీనిపై ఏప్రిల్ 12న విచారణ ప్రారంభమవుతుందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది.

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే ? 
ఈ ఏడాది జనవరి 9వ తేదీన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులతో పోల్చారు. ‘‘కౌరవులు ఎవరు ? నేను ముందుగా మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వారు హాఫ్ ఖాకీ ప్యాంట్‌లు ధరిస్తారు. వారు చేతిలో లాఠీలు పట్టుకుని, శాఖలు పట్టుకుంటారు. భారతదేశంలో ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు కౌరవులకు అండగా నిలుస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

‘‘పాండవులు డీమోనిటైజేషన్ చేశారా, తప్పుడు జీఎస్టీని అమలు చేసారా? వారు ఎప్పుడైనా అలా చేస్తారా? ఎన్నడూ లేదు. ఎందుకు? ఎందుకంటే వారు తపస్వి కాబట్టి. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు ఈ భూమిని తపస్వి నుండి దోచుకోవడానికి ఒక మార్గం అని వారికి తెలుసు. (ప్రధాని) నరేంద్ర మోడీ ఈ నిర్ణయాలపై సంతకం చేశారు. అయితే మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల శక్తి దీని వెనుక ఉంది.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ రక్షణ ఎగుమతులు పెరుగుతున్నాయి - రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఈ వ్యాఖ్యలపైనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువునష్టం దావా వేశారు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా.. సాయం చేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటన తనను బాధించిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios