ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో రక్షణ ఎగుమతులు పెరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇది భారత్ కు చెప్పుకోదగిన గెలుపు అని తెలిపారు.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2021-22లో దేశ రక్షణ ఎగుమతులు రూ.12,814 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. ఇది దేశానికి చెప్పుకోదగిన విజయం అని తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.
మండే ఎండలు.. ఈ సారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు : ఐఎండీ హెచ్చరికలు
‘‘2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరుకున్నాయి. ఇది దేశానికి చెప్పుకోదగ్గ విజయం. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో మన రక్షణ ఎగుమతులు విపరీతంగా పెరుగుతున్నాయి’’ అని ట్వీట్ చేశారు.
రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ పై ప్రధాని మోడీ స్పందించారు. మేక్ ఇన్ ఇండియా పట్ల భారతదేశ ప్రతిభకు, ఉత్సాహానికి స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. ‘‘అద్భుతం.. ‘మేక్ ఇన్ ఇండియా’ పట్ల భారతదేశం ప్రతిభ, ఉత్సాహానికి ఇది స్పష్టమైన నిదర్శనం. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని ఇది తెలుపుతోంది. భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తి కేంద్రంగా మార్చే ప్రయత్నాలకు మా ప్రభుత్వం మద్దతునిస్తూనే ఉంటుంది.’’ అని ప్రధాని ట్వీట్ చేవారు.
బహుశా ప్రధాని డిగ్రీ నకిలీది కావచ్చు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి
కాగా.. 2020-21లో రూ.8,434 కోట్లు, 2019-20లో రూ.9,115 కోట్లు, 2018-19లో రూ.10,745 కోట్ల విలువైన మిలటరీ హార్డ్ వేర్ ను భారత్ ఎగుమతి చేసింది. 2017-18లో ఈ మొత్తం రూ.4,682 కోట్లు, 2016-17లో రూ.1,521 కోట్లుగా ఉంది. 2024-25 నాటికి రూ.1,75,000 కోట్ల విలువైన డిఫెన్స్ హార్డ్ వేర్ తయారు చేయాలని, రక్షణ ఎగుమతులను రూ.35,000 కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్నేళ్లుగా దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
ఇది ట్రయలే.. వచ్చే వారం మరో సంచలనం బయటికి : బాంబు పేల్చిన సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్
ఇదే అంశంపై గురువారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా దేశీయ రక్షణ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. తమ అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర దేశాలకు ఆయుధాలు, సామగ్రిని ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. 7-8 సంవత్సరాల క్రితం రక్షణ ఎగుమతులు రూ. 900 కోట్లుగా ఉన్నాయని, ప్రస్తుతం ఇవి విపరీతంగా పెరిగాయని తెలిపారు. 2026 నాటికి రూ. 40,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏర్పాటు చేసిన స్టార్టప్ ఆధారిత ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను కూడా రక్షణ మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 100కు పైగా యూనికార్న్ ఏర్పాటు సాధ్యమైందని, ఇది ఈ ఎకోసిస్టమ్ విజయానికి నిదర్శనం అని తెలిపారు.
