Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్‌లో మళ్లీ పోలీసులపై దాడి.. ముగ్గురికి గాయాలు

మధ్యప్రదేశ్ లో కృష్ణ జింక వేటగాళ్లు ముగ్గురు పోలీసులను కాల్చి చంపిన ఘటన మరవక ముందే అదే రాష్ట్రంలోని ధార్ జిల్లాలో పలువురు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిని తరువాత పోలీసులు అరెస్టు చేశారు. 

Another attack on police in Madhya Pradesh .. Three injured
Author
Bhopal, First Published May 15, 2022, 3:03 PM IST

మధ్యప్రదేశ్ లో మళ్లీ పోలీసులపై దాడి జరిగింది. తప్పిపోయిన మహిళ కోసం వెతుకుతున్న పోలీసులను  కొందరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురి పోలీసులకు గాయాలు అయ్యాయి. దీంతో ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

CNG price hiked: మ‌ళ్లీ పెరిగిన సీఎన్జీ ధ‌ర‌లు.. కిలోపై రూ.2 భారం

వివ‌రాలు ఇలా ఉన్నాయి. ధార్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న తిర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరయ్‌వాడి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మహిళ తన బిడ్డతో కనిపించకుండా పోయిందన్న సమాచారంతో పోలీసు బృందం ఆ గ్రామానికి చేరుకుంది. అయితే గ్రామం నుంచి బయటకు వస్తుండగా ఆదివాసి తెగకు చెందిన సుగ, అతని కుటుంబ సభ్యులు పోలీసు బృందంపై దాడి చేశారు. వారి నుంచి  తుపాకులు లాక్కున్నారు. 

అనుకోని ఈ పరిణామం చోటు చేసుకోవ‌డంతో ఆ గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల‌పై దాడి చేసిన వారిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఆరుగురిని అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కానిస్టేబుళ్లు ప్రకాష్ భవార్, మహేంద్ర రాజ్‌పుత్ తో పాటు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మనీష్ భాగోరే గాయ‌ప‌డ్డార‌ని, నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు.

వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. ఎక్కడెక్కడ అంటే?

ఇదిలా ఉండ‌గా ఇదే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శనివారం గుణాలో జంతు వేటగాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. కృష్ణ జింకల వేటగాళ్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ సంత్రమ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ‌ను దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దుండ‌గుల‌ను పోలీసులు ప‌ట్టుకునేందుకు వెళ్లిన స‌మ‌యంలో ఇది జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. కార‌కుల‌పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేవారు. 

వెల్ల‌విరిసిన సోద‌ర‌భావం.. కుల్గాంలో మ‌హిళా కాశ్మీర్ పండిట్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన ముస్లింలు

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిపక్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అధికార బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్ ఆరోపించారు. ‘‘ బీజేపీ ప్రభుత్వంలో నేరస్థుల ఆత్మలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి పోలీసులను కూడా వదిలిపెట్టడం లేదు. హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి ’’ అని ఆయ‌న డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios