భారతదేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అన్నప్పటికీ అవి యధావిథిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి వాటి కోవలోనే తాజాగా తమిళనాడులో జరిగింది.

ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లి కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం 75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం చేశారు. ప్రతి ఏటా ఆడి అమావాస్య సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దేవాలయంలో ఆనవాయితీగా వస్తోంది.