Asianet News TeluguAsianet News Telugu

ఇక వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి..

ప్రయాణికుల ఆదరాభిమానాలు చోరగొంటున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇక స్లీపర్ బెర్తులు రానున్నాయి. ఇలాంటి రైళ్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. 

And sleeper berths in Vande Bharat trains.. Available by December..
Author
First Published Feb 5, 2023, 10:15 AM IST

వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. వీటిని ప్రయాణికులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఈ వందే  భారత్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు మార్పులు తీసుకొస్తున్నారు. కొంత కాలం కిందట మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తీసుకొస్తామని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ రైళ్లు తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పనున్నారు. అయితే తాజాగా మరి కొన్ని మార్పులు కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. 

రోజుకు 5 సార్లు నమాజ్ చేసినా ముస్లింలు తీవ్రవాదులవుతున్నారు.. హిందూ బాలికలను కిడ్నాప్ చేస్తున్నారు - రామ్‌దేవ్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపింగ్ బెర్తులు కూడా కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అలాగే వందే భారత్ మెట్రో కూడా తీసుకురావాలని చూస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు 500-600 కిలో మీటర్ల మధ్య ప్రయాణిస్తున్నాయి. అయితే మెట్రో వందే భారత్ రైళ్లు రెండు నగరాల మధ్య 100 కిలో మీటర్ల మధ్య కొనసాగుతాయని వైష్ణవ్ పేర్కొన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు..టిఎంసి కార్యకర్త మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

జాతీయ రవాణాదారుల అంచనాల ప్రకారం.. దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు 2026 జూలై, ఆగస్టులో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్-ముంబై మధ్యన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం రోలింగ్ స్టాక్ (రైళ్లు) టెండర్ విడుదల అవుతాయని చెప్పారు. మహారాష్ట్రలోని మొత్తం 13 స్టేషన్లు గంటకు 320 కిలో మీటర్ల వేగంతో వెళ్లే రైలు కోసం వర్చువల్‌గా సిద్ధంగా ఉన్నాయని, ప్రాజెక్ట్‌లోని 140 కిలో మీటర్ల సెక్షన్‌లో స్తంభాలు ఏర్పాటు చేశామని వైష్ణవ్ ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ రైలు కోసం ఎనిమిది నదులపై వంతెన కూడా నిర్మిస్తున్నారని తెలిపారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కు అరుదైన గౌరవం .. హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు ఆహ్వానం

రైలు ప్రయాణికులలో ఆదరణ పొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ రైలు గంటకు 220 కిమీ వేగంతో నడిచేందుకు రూపుదిద్దుకుంటోంది. అల్యూమినియంతో చేసిన ఈ స్లీపర్ వెర్షన్ రైళ్లు ట్రాక్‌లపై గంటకు 200 కిమీ వేగంతో వెళ్తాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూర్చొని ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భర్తీ చేస్తుండగా.. స్లీపర్ వేరియంట్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా పని చేయనుంది. కాగా.. 400 వందేభారత్ రైళ్ల నిర్మాణానికి రైల్వే బిడ్లను పిలిచింది. జనవరిలో ప్రాజెక్ట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios