ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కు అరుదైన గౌరవం .. హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు ఆహ్వానం
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. హార్వర్డ్ యూనివర్శిటీని సందర్శించడానికి , ఇతర ప్రపంచ నాయకులతో సంభాషించడానికి ఆమె అవకాశం లభించింది.భారత దేశంలో తనకు ఎదురైన అనుభవాలను, తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో జరగనున్న ' భారతదేశ వార్షిక సదస్సు'లో ప్రసంగించేందుకుస్వాతి మలివాల్‌కు ఆహ్వానం అందింది. ఈ సదస్సు ఫిబ్రవరి 11-12 తేదీల్లో జరుగుతుంది.
ఈ ఏడాది డిసిడబ్ల్యు అధ్యక్షురాలిని 'ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సులో ప్రసంగించాలని కోరారు. భారతదేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. భారత ప్రజాస్వామ్య పునాది, రాబోయే 25 ఏళ్లలో మనం ఏమి సాధించాలనుకుంటున్నామో ప్రతిబింబించమని అభ్యర్థించారు.
స్వాతి మలివాల్ భారత ప్రజాస్వామ్యంలో మహిళల పాత్ర, ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై అట్టడుగు స్థాయి నుంచి విధాన స్థాయిలో తన సంవత్సరాల పని నుండి తన అనుభవాన్ని పంచుకుంటారు. ఈ మేరకు జనవరి 18న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సదస్సులో పాల్గొనేందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫైల్‌ను పంపినట్లు సమాచారం. ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.
కాగా.. స్వాతి మలివాల్ మాట్లాడుతూ..కమీషన్ పనికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వించదగిన విషయమనీ, ప్రపంచ వేదికపై భారతీయ రాజకీయాల్లో మహిళల పాత్రపై తన ఆలోచనలను పంచుకోవడానికి తనన్ను ఆహ్వానించారని తెలిపారు. తను హార్వర్డ్ యూనివర్శిటీకి ప్రయాణించడానికి, ఇతర గ్లోబల్ లీడర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడానికి,దేశంతో తనకు ఎదురైన అనుభవాలను పంచుకోవాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశం యొక్క ధనిక, శక్తివంతమైన ప్రజాస్వామ్యంపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి వీలుగా తనకు అవసరమైన ఆమోదం త్వరగా లభిస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు.ఫైలును ఆమోదించాలని స్వాతి మలివాల్ ఎల్‌జీకి విజ్ఞప్తి చేశారు.
ఇంతకు ముందు కూడా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సులో అనేక మంది భారతీయ మంత్రులు, వ్యాపారవేత్తలు,ప్రభావవంతమైన వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చిన చరిత్ర ఉంది. అంతకుముందు నితిన్ గడ్కరీ, అమర్త్యసేన్, జోయా అక్తర్, వినోద్ రాయ్, అజీమ్ ప్రేమ్‌జీ, శశి థరూర్, పి. చిదంబరం, మహువా మోయిత్రాలకు ఈ అదుదైన అవకాశం దక్కింది.