Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామమందిర నిర్మాణం: తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి దేవతా విగ్రహాలు

ప్రసిద్ధ రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తుండగా విరిగిన దేవతా విగ్రహాలతో పాటు 5 అడుగుల ఎత్తైన శివలింగం, ఏడు నల్లరాతి స్తంభాలు, ఆరు ఎర్ర రాతి స్తంభాలు, కలశంతో పాటు పలు పురాతన వస్తువులు లభించాయి

ancient idols shivling found at ayodhya rama janmabhoomi
Author
Ayodhya, First Published May 21, 2020, 6:34 PM IST

అయోధ్యలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ప్రసిద్ధ రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తుండగా విరిగిన దేవతా విగ్రహాలతో పాటు 5 అడుగుల ఎత్తైన శివలింగం, ఏడు నల్లరాతి స్తంభాలు, ఆరు ఎర్ర రాతి స్తంభాలు, కలశంతో పాటు పలు పురాతన వస్తువులు లభించాయి.

Also Read:అయోధ్యలో రామమందిర నిర్మాణం: కీలక ఘట్టం పూర్తి

పది రోజులుగా రామ జన్మభూమిలో భూమిని చదును చేస్తున్నామని.. ఈ క్రమంలో అక్కడ శిథిలాలను తొలగిస్తుండగా పురాతన స్తంభాలతో పాటు శిల్పాలు వెలుగు చూశాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజ్ తెలిపారు.

దీనిపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. మే 11న రామాలయం పనులు ప్రారంభమైనప్పటి నుంచి తవ్వకాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో పురాతన అవశేషాలు బయటపడుతున్నాయని చెప్పారు.

Also Read:రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్.. లోక్ సభలో మోదీ ప్రకటన

కాగా దశాబ్ధాల నుంచి వివాదాల్లో నానుతున్న అయోధ్య సమస్యను సుప్రీంకోర్టు గతేడాది పరిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రామ జన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు వేరే ప్రదేశంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios