Asianet News TeluguAsianet News Telugu

వీళ్లను అడగండి.. దేశభక్తి అంటే ఏంటో చెబుతారు.. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్...

స్వాతంత్య్ర దినోతవ్సం సందర్బంగా ఓ అద్భుతమైన ఫొటోతో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Anand Mahindra tweet on Independence Day, Shares Powerful Pic goes viral
Author
Hyderabad, First Published Aug 16, 2022, 9:40 AM IST

న్యూఢిల్లీ : ఆనంద మహీంద్రా తన విభిన్నమైన ట్వీట్లతో నెటిజన్లకు సుపరిచితం. సందర్బానికి తగ్గట్టుగా ఆయన చేసే ట్వీట్లు అందర్నీ ఆలోచింపచేస్తాయి. ప్రత్యేకమైన ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారాయన. ఆనంద మహీంద్రా చేసే ట్వీట్లు ఆయన బిజినెస్ కు సంబంధించినవి కావు.. పూర్తిగా వ్యక్తిగతం.. అలాగని పర్సనల్ విషయాలు కాదు.. సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద.. పూర్తి పాజిటివ్ గా స్పందించడం.. ఆశావహదృక్పథాన్ని కలిగించడం.. పాజిటివ్ వైబ్స్ ను స్ప్రెడ్ చేయడం ఆయన ట్వీట్ల ప్రత్యేకత. అదే క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

75 సంవత్సరాల భారత స్వాతంత్య్రోద్యమ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 13 నుంచి 15 వరకు దేశంలోని ప్రతీ ఇంటిమీదా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందిపుచ్చుకుని ఎంతోమంది ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. అయితే, దీనిమీద సోషల్ మీడియాలో వ్యతిరేకభావనలు, విమర్శలు కూడా అదే స్తాయిలో వ్యక్తం అయ్యాయి. 

"స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఇంత చేయడం అవసరమా, అత్యత్సాహం.." అని ఆలోచిస్తున్న వారికి సమాధానంగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఫొటో సమాధానం చెబుతుందంటూ షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఫొటోలో ఏముందంటే.. ఓ వృద్ధ జంట తమ ఇంటిముందు జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. దీనికోసం అతను డ్రమ్ము పట్టుకోగా, ఆమె ఆ ఇనుప డ్రమ్ము మీదికి ఎక్కి జాతీయ జెండాను కడుతుంది. డ్రమ్ము ఎక్కడం కోసం వాడిన ప్లాస్టిక్ కుర్చీ కూడా పక్కనే కనిపిస్తుంది. జెండాను ఎగురవేయడానికి ఆ జంట.. ముఖ్యంగా ఆ మహిళ కృషిని వివరిస్తుంది.

నువ్వే ఓ బాంబర్.. ప్రియుడితో ప్రియురాలి సరదా చాటింగ్...ఆరు గంటల పాటు ఆగిపోయిన విమానం...

ఈ ఫొటోతో పాటు.. ఆనంద్ మహీంద్రా రాసిన క్యాప్షన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంత అవసరమా? అని ఆలోచించేవారికి గంటలతరబడి చేసే ఉపన్యాసం కూడా చెప్పలేని వివరణ.. ఈ ఇద్దరి చర్య చెబుతోంది. జై హింద్.. అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు లక్షా ముప్పై ఆరు వేల లైక్‌లు, 13 వేల రీట్వీట్ లు వచ్చాయి. 

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లలో హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేయాలని లేదా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావనను ప్రేరేపించడం మరియు జాతీయ జెండాపై అవగాహనను పెంపొందించడం ఈ  కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన. ఈ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడానికి, జాతీయ జెండాను మరింతగా ప్రేమించడానికి స్ఫూర్తినిస్తుంది. అంతకుముందు, ఎంపిక చేసిన సందర్భాలలో తప్ప పౌరులు జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతిలేదు. 

 

https://twitter.com/anandmahindra/status/1558759155040657409?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558782801138384909%7Ctwgr%5E943581972a5bffa7a0c8f8debda367e77db8379b%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fjust-ask-these-two-on-independence-day-anand-mahindra-shares-powerful-pic-3256572
Follow Us:
Download App:
  • android
  • ios