ఆనంద్ మహీంద్రా ట్వీట్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే ?
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను పోస్టు చేసిన ఓ వీడియోకి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర.. ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో .. కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యం ఏదోక పోస్టు చేస్తూ.. నెటిజన్లను తన వైపు తిప్పకుంటారు. అలాగే లోకల్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. వారి ప్రతిభను మెచ్చి.. వారి చేయూతను ఇచ్చిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆనంద్ మహీంద్రాకు సోషల్ మీడియాలో ఫాలోంగ్ ఎక్కువ. కానీ, తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ట్వీట్ చేసిన వీడియో పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అసలేం జరిగిందంటే..
తాజాగా.. ఆనంద్ మహీంద్ర మట్టితో వినాయకుడి విగ్రహాన్నితయారు చేస్తున్న బాలుడి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బాలుడు బంకమట్టితో గణపతి విగ్రహాన్ని చాలా కళాత్మకంగా తయారు చేస్తున్నాడు. ప్రధానంగా ఆ బాలుడు తన చిన్నచేతులతో వినాయకుడి తొండాన్ని చాలా చక్కగా.. అందంగా తీర్చిదిద్దాడు. దీంతో ఆ పిల్లవాడి ప్రతిభకు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా.. వీడియోను వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆ పిల్లవాడు గొప్పశిల్పి.. ఆ చిన్నారి తన చిన్ని చేతులను.. ఎంతో అనుభవం ఉన్న శిల్పిగా ప్రతిభావంతంగా కదులుతున్నాడు. అతని లాంటి పిల్లలు వారికి తగిన శిక్షణ పొందారా..? లేదా వారి ప్రతిభను వదులుకోవాలా..? అని నేను ఆ చిన్నారి ప్రతిభకు ఆశ్చర్యపోతున్నాను..?" అంటూ కామెంట్ చేస్తూ షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే.. నెట్టింట్లో మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. కొందరూ ఆ బాలుడిని ప్రతిభను ప్రశంసించగా.. మరికొందరూ మాత్రం బాలుడి పేదరికాన్ని. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. గతంలో ఎన్నోసార్లు ఆనంద్ మహీంద్రా ఎన్నో వీడియోలను షేర్ చేశారు కానీ.. నెటిజన్ల నుండి ఇలాంటి రియాక్షన్ చూడలేదనే చెప్పాలి. అందరి ఆలోచన విధానం ఒక్కేలా ఉండదన్నడానికి ఇదే నిదర్శనం.