Asianet News TeluguAsianet News Telugu

ఇట్ల కూడా రోడ్లు వేస్తరా..? ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. వైరల్..

సాధారణంగా రోడ్డు వేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. దానికి యంత్రాలు, మనుషులు, మెటీరియల్ వంటివి చాలానే అవసరమవుతాయి. కానీ నిమిషాల్లోనే వేసే రోడ్డు గురించి ఎప్పుడైనా విన్నారా.. ? ఎలాంటి ప్రదేశాల్లోనైనా వేయగలిగే పోర్టబుల్ రోడ్డు (portable roads) గురించి చదవారా ? అయితే ఆనంద్ మహీంద్ర (anand Mahindra shared video about portable roads) అలాంటి రోడ్డుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దాని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Anand Mahindra shared an interesting video related to portable roads.. The video is viral..ISR
Author
First Published Jan 16, 2024, 7:44 PM IST

anand Mahindra : ప్రముఖ బిలియనీర్, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. సాధారణంగా రోడ్లు వేయాలంటే రెండు, మూడు రకాల కంకరలు, తారు, యంత్రాలు, కూలీలు చాలా పెద్ద తతంగమే ఉంటుంది. రోడ్డు వేసేందుకు నెలల సమయం తీసుకుంటుంది. కానీ ఆనంద్ మహీంద్ర తన ‘ఎక్స్’ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో మాత్రం చాలా సునాయాసంగా, చాలా తక్కువ సమయంలో రోడ్డు నిర్మాణం జరగడం కనిపిస్తోంది.

పంజాబ్ సీఎంకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపు.. రిపబ్లిక్ డే రోజు దాడి చేస్తామని హెచ్చరిక..

అందుకే దానిని చూసిన ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ రోడ్డు చాలా అద్బుతంగా ఉందని, మన సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది సైన్యానికి ఎంతో మేలు చేస్తుంది. కష్టతరమైన భూభాగాల్లో దీన్ని నిర్మించడం సులువు అవుతుంది. దీని వల్ల వాహనాల వేగం పెరుగుతుంది. ఈ రోడ్డును మీకు కావలసినప్పుడు మడతపెట్టవచ్చు. ఎక్కడైనా వేయవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు సహాయక చర్యల సమయంలో ఈ రోడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.’’ అని ఆయన పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్..

అసలేంటి ఈ రోడ్డు ప్రత్యేకత..
ఇదొక పోర్టబుల్ రోడ్డు. దీనిని భారీ యంత్రాల సాయంతో అవసరమైన సమయంలో, అవసరమైన చోట వేసుకోవచ్చు. అవసరం లేదనకుంటే దానిని సునాయసంగా తొలగించవచ్చు. చాలా ప్రాంతాల్లో ఈ పోర్టబుల్ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోడ్‌వే కిట్ అల్యూమినియంతో తయారు చేస్తారని ఆ కిట్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. అది అత్యవసర సమయంలో రోడ్డు సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా క్రేన్‌లు, వాహనాలు, అంబులెన్స్ వంటి వాహనాల వేగాన్ని పెంచుతుంది. దీనిని ఇప్పటికే పూర్తిగా పరీక్షించారు. ఈ పోర్టబుల్ రోడ్డు వ్యవస్థ చిత్తడి నేల, మంచు, ఇసుక, నదీ తీరాలు వంటి సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో మెరుగ్గా పని చేస్తుంది. 

ఈ పోర్టుబుల్ రోడ్డును తయారు చేసిన కంపెనీ దానికి బోట్ ర్యాంప్ కిట్ అని పేరు పెట్టింది. ఇది ఒక తాత్కాలిక రోడ్డు. దీనిని ఎక్కడైనా అమర్చవచ్చు. ఎప్పుడైనా తొలగించవచ్చు. వాహనాలు నడపలేని ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు. ఈ రహదారిని అటవీ ప్రాంతాలు, చిత్తడి ప్రదేశాలలో కూడా ఉపయోగించవచ్చని  ఆ సంస్థ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios