Asianet News TeluguAsianet News Telugu

చైనాపై ఇక డేగ కన్ను.. ఆర్మీ చేతికి తొలి లైట్ కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌, మిస్సమారీలో బేస్

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత వేళ భారత సైన్యం చేతికి తొలి లైట్ కంబాట్ హెలికాఫ్టర్ స్క్వాడ్రన్ అందనుంది. మిస్సమారి బేస్.. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీ వెంట వ్యూహాత్మక ప్రాంతంలో వుంది. దీనికి 150 కిలోమీటర్ల దూరంలో బమ్ లా పాయింట్ వుంది. 

An eye on China, Missamari to host Army's first Light Combat Helicopter squadron
Author
First Published Oct 5, 2022, 7:24 PM IST

ఈ ఏడాది జూలైలో భారత సైన్యం కోరిన లైట్ కంబాట్ హెలికాఫ్టర్లు (ఎల్‌సీహెచ్)కు సంబంధించిన ఫస్ట్ క్వాడ్రన్ వచ్చే నెల ప్రారంభంలో నియంత్రణ రేఖకు సమీపంలో వున్న అస్సాంలోని మిస్సమారి ఆర్మీ ఏవియేషన్ బేస్‌కు మార్చనున్నారు. ఇప్పటికే హెచ్ఏఎల్ నుంచి మూడు ఎల్‌సీహెచ్‌లను బెంగళూరులో ఆర్మీ స్వీకరించింది. నాలుగవ దానిని ఈ నెలాఖరులో, ఐదవ దానిని నవంబర్‌లో అందుకోనుంది భారత సైన్యం. మిస్సమారి బేస్.. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీ వెంట వ్యూహాత్మక ప్రాంతంలో వుంది. దీనికి 150 కిలోమీటర్ల దూరంలో బమ్ లా పాయింట్ వుంది. 

తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంట చైనాతో కొనసాగుతోన్న ప్రతిష్టంభన మధ్య తూర్పు సెక్టార్‌లో ఎల్‌సీహెచ్ విస్తరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. 5.8 టన్నుల బరువుండే ఈ హెలికాఫ్టర్లు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి హెలీనా, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌తో ఏర్పాటు చేశారు. 

ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 లైట్ కంబాట్ హెలికాఫ్టర్ల కొనుగోలుకు రూ.377 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆంక్షలతో ఆమోదం తెలిపింది. ఈ 15 ఎల్‌సీహెచ్‌లలో పది భారత వైమానిక దళానికి, ఐదు ఆర్మీకి కేటాయించారు. రాబోయే రోజుల్లో ఆర్మీ 95, వాయుసేన మరో 65 హెలికాఫ్టర్లను ఎల్‌సీహెచ్‌లను సమకూర్చుకోవాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. 

మార్చి 2021లో భారత సైన్యం తన ప్రతి స్పందనను, అలాగే మందుగుండు సామాగ్రిని బలోపేతం చేయడానికి తన కొత్త ఏవియేషన్ బ్రిగేడ్‌ను పెంచింది. బ్రిగేడ్ చిరుత, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ (ఏఎల్‌హెచ్) ధృవ్ యుటిలిటీ హెలికాఫ్టర్‌లను నిర్వహిస్తుంది. రుద్ర వెపన్‌తో కూడిన ఏఎల్‌హెచ్, రిమోట్ ద్వారా నడిచే విమానం హెరాన్ ఎంకే1లు కూడా ఇందులో వున్నాయి. 

గత కొన్ని సంవత్సరాలుగా.. సైన్యం, వైమానిక దళం తమ రక్షణ సామర్ధ్యాలను ఎల్ఏసీ వైపు చైనాకు ధీటుగా పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే తూర్పు సెక్టార్‌లో తమ రక్షణ సామర్ధ్యాలను , మందుగుండు సామాగ్రిని గణనీయంగా పెంచుకున్నాయి. తూర్పు సెక్టార్‌లో సిక్కిం నుంచి అరుణాచల్‌ ప్రదేశ్ వరకు.. చైనాతో బారత్ 1,346 కి.మీ పొడవైన ఎల్ఏసీని పంచుకుంటుంది. ప్రస్తుతానికి భారత సైన్యం మూడే ఏవియేషన్ బ్రిగేడ్‌లను కలిగి వుంది. ఇవి లేహ్, మిస్సమారి, జోధ్‌పూర్. వీటిలో మొత్తం 145 ఏఎల్‌హెచ్‌లు పనిచేస్తున్నాయి. వీటిలో 75 రుద్ర వంటి రూపాంతరం చెందిన ఆయుధాలు కూడా వున్నాయి. మరో 25 ఏఎల్‌హెచ్ III ఆర్డర్ దశలో వున్నాయి. ఇవి కూడా వచ్చే రెండేళ్లలోపు ఏవియేషన్ బ్రిగేడ్‌లోకి చేరుతాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios