పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హత్యకు రష్యన్ తయారీ ఏఎన్ 94 రైఫిల్‌ను వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పంజాబీ సింగర్, కాంగ్రెస్ (congress) నేత సిద్దూ మూసేవాలా (sidhu moose wala) దారుణహత్యతో దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. మిత్రులతో కలిసి తన స్వగ్రామానికి వస్తున్న ఆయన కారును వెంబడించిన దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్ మార్టం నివేదికలో (sidhu moose wala postmortem) ఆయన శరీరంలోకి 24 బుల్లెట్లు దూసుకెళ్లాయని వైద్యులు తెలిపారు. క్షణాల వ్యవధిలో ఆ స్థాయిలో బుల్లెట్ల వర్షం కురిపించగల తుపాకులపై పోలీసులు ఆరా తీశారు.
Also Read:Sidhu Moose Wala Murder: సిద్దూను ఎలా చంపారంటే?.. భయానక వివరాలు ఇవే
తొలుత ఏకే 47 మిషన్ గన్స్‌ని (ak 47 rifle ) దుండగులు వినియోగించారని అంతా భావించారు. కానీ ఘటనాస్థలిలో దొరికిన ఖాళీ తూటాలను పరిశీలించగా.. అవి రష్యా తయారీ ఏఎన్ 94 రైఫిల్‌కు (an 94 rifle) చెందినవిగా గుర్తించారు. అయితే ఎక్కడో రష్యాలో (russia) తయారైన ఈ తుపాకీ పంజాబ్‌కు (punjab) ఎలా చేరిందనేది సంచలనం సృష్టిస్తోంది. ఈ రైఫిల్‌ను మన దేశంలో వినియోగించరు.. దీనిని కేవలం రష్యా సైన్యం మాత్రమే వినియోగిస్తారు. అలాగే ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనే వేర్పాటువాద సంస్థ వద్ద కూడా ఈ తుపాకీ వుంది.
సిద్ధూ మూసేవాలా హత్యకు ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్న దుండగులు.. తొలుత అతని ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. సిద్ధూ ఇంటి వద్ద ఏకే 47 రైఫిల్స్‌తో భద్రతా సిబ్బంది కనిపించారు. దీంతో వారు కెనడాలో వుంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ సాయంతో ఏఎన్ 94 రైఫిల్‌ను పంజాబ్‌కి తెప్పించి మూసేవాలాను కాల్చి చంపారని పోలీసులు భావిస్తున్నారు.
ఏఎన్-94 రైఫిల్ ప్రత్యేకతలు:
ఈ తుపాకీలోని ఏఎన్ అంటే అవోటోమాట్ నొకొనోవ్. ఆయుధాల డిజైనర్ గెన్నాడి నికొనోవ్ పేరును దీనికి పెట్టారు. ఏఎన్ 94 డిజైన్‌పై 1980ల నుంచి దృష్టి పెట్టిన గెన్నాడి.. 1994లో తుది రూపుకు తెచ్చారు. రష్యాలో ఏకే - 74 రైఫిల్‌ను భర్తీ చేసేందుకు ఏఎన్ - 94ను అభివృద్ధి చేశారు. అయితే ధర ఎక్కువగా వుండటం, సంక్లిష్టమైన డిజన్ కావడంతో ప్రపంచాన్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం కొన్ని అవసరాల మేరకు రష్యా సైన్యం ఏఎన్ 94ను వినియోగిస్తోంది.
ఇక దీని పనితీరు విషయానికి వస్తే.. టూరౌండ్ బరస్ట్ మోడ్‌లో నిమిషానికి 600 బుల్లెట్లను పేల్చగలదు. అదే ఆటోమేటిక్ మోడ్‌లో నిమిషానికి 1,800 తూటాలు దూసుకొస్తాయి. దీని తూటా సెకనుకు 900 మీటర్ల వేగంతో ప్రయాణించి.. 700 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అంతేకాదు ఈ రైఫిల్‌కు జీపీ -30 గ్రేనేడ్ లాంఛర్‌ను కూడా అమర్చవచ్చు.
