Asianet News TeluguAsianet News Telugu

మోడీతో రాహుల్ కౌగిలింత: అమూల్ ఏం చేసిందంటే?


న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న తర్వాత  ప్రధానమంత్రి మోడీని  కౌగిలించుకొని ఆ తర్వాత  తన స్థానంలోకి వచ్చి కన్నుగీటాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ.  అయితే  ఈ ఘటన పార్లమెంట్‌లో నవ్వులు తెప్పించింది.

Amul features Rahul Gandhi’s ‘impromptu’ hug to PM Modi, Twitterati praise their wit and sarcasm


న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్న తర్వాత  ప్రధానమంత్రి మోడీని  కౌగిలించుకొని ఆ తర్వాత  తన స్థానంలోకి వచ్చి కన్నుగీటాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ.  అయితే  ఈ పరిణామం పార్లమెంట్‌లో నవ్వులు కురిపించింది. ఇదిలా ఉంటే ఈ సన్నివేశాన్ని అమూల్  కంపెనీ డిజైన్ చేసిన పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్‌ టాపిక్‌ గా మారింది. అమూల్ రూపొందించిన ఈ పిక్చర్‌ను  పలువురు నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు.

కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా  రాహుల్ గాంధీ మోడీతో కలిసి కరచాలనం చేయడమే కాకుండా ఆయనను ఆలింగనం చేసుకొన్నాడు. ఆ తర్వాత త న స్థానంలోకి వచ్చి కూర్చొని కన్నుగీటాడు.ఈ విషయమై స్పీకర్ సుమిత్రా మహజన్  రాహుల్‌ తీరును తప్పుబట్టారు.  నియమనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని  సూచించారు.

 

 

ఇదిలా ఉంటే  మోడీ, రాహుల్ కౌగించుకొన్నట్టుగా అమూల్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.  రాహుల్‌, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉటంకిస్తూ.. Embracing  Ya embarrassing’ అంటూ ఓ పిక్చర్‌ను విడుదల చేసింది. రాహుల్ గాంధీ కన్నుకొట్టడాన్ని కూడ ఆ పిక్చర్ లో వేసింది.  తాజాగా పార్లమెంట్‌లో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రతిబింబించేలా అమూల్ రూపొందించిన ఈ పిక్చర్  నెటిజన్ల నుండి ప్రశంసలు పొందుతోంది.

పలువురు నెటిజన్లు ఆమూల్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.  వ్యంగ్యంతో పాటు హస్యాన్ని ప్రతిబింబించేలా  కరెంట్ టాపిక్స్‌తో పిక్చర్స్‌ను రూపొందిస్తున్న అమూల్ బెస్ట్ అంటూ నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios