ఖలీస్తానీ  సానుభూతిపరుడు  అమృతాపాల్ సింగ్  భార్యను  ఇవాళ  అమృత్ సర్ ఎయిర్ పోర్టులో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను గురువారంనాడు అమృత్ సర్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఇంగ్లాండ్ వెళ్లేందుకు కిరణ్ దీప్ కౌర్ అమృత్ సర్ లోని గురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. కిరణ్ దీప్ కౌర్ ఇంగ్లాండ్ వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కిరణ్ దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలు. కిరణ్ దీప్ కౌర్ పై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కిరణ్ దీప్ కౌర్ ఇండియాలో ఉండడానికి వీసా గడువు కూడా ముగియనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అమృతాపాల్ సింగ్ ను కిరణ్ దీప్ కౌర్ వివాహం చేసుకున్నారు. అమృతాపాల్ సింగ్ ను వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా ఆమె ఇంగ్లాండ్ కు వెళ్లే సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ ఈ ఏడాది మార్చి 18 నుండి పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు.