ఏప్రిల్ 14న అమృత్ పాల్ సింగ్ సిక్కులతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో పంజాబ్ లో పోలీసులకు సెలవులు క్యాన్సిల్ చేశారు. అప్పటివరకు ఎవ్వరూ సెలవుల్లో ఉండొద్దని ఆదేశించారు.
చండీగఢ్ : రాడికల్ సిక్కు బోధకుడు అమృతపాల్ సింగ్ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. చిక్కడు, దొరకడు రీతిలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారికి మరో చిక్కు తెచ్చిపెట్టాడు..ఈనెలలో అమృత్పాల్ సింగ్ సిక్కులతో సమావేశం కావాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర పోలీసులకు సెలవులు తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఇప్పటికే సెలవుల మీద వెళ్లిన వారికి కూడా సెలవులు రద్దుచేసి వెనక్కి పిలిపిస్తున్నారని సమాచారం. ఈ మేరకి పోలీసు విభాగం నుంచి ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది.
ఈనెల 14వ తేదీన బైశాఖీ సందర్భంగా అమృత్ పాల్ సింగ్ చిక్కులతో సమావేశం ఏర్పాటు చేయాలని కొద్ది రోజుల క్రితం అకాల్ తక్త్ చీఫ్ ను అభ్యర్థించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే పంజాబ్ డిజిపి సెలవుల గురించి అందరికీ మెసేజ్ లు పంపారని సంబంధిత వర్గాల సమాచారం. ఏప్రిల్ 14 వరకు ఎటువంటి కొత్త సెలవులు మంజూరు చేయొద్దని, ఒకవేళ ఇప్పటికే సెలవులు ఇచ్చినట్లయితే వాటన్నిటిని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అనే స్థాయిలతో సంబంధం లేదు. పోలీస్ శాఖలోని అందరికీ ఇది వర్తిస్తుంది.
తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం - ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తుఫాన్ సింగ్.. అమృత్పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు. అతడిని పంజాబ్ పోలీసులు కొద్ది వారాల క్రితం ఒక కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దీనిని అమృత్ పాల్ సింగ్ వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చాడు. ఈ పిలుపుమేరకు ఫిబ్రవరి 24వ తేదీన పెద్ద సంఖ్యలో గుమిగూడిన యువత అమృత్ సర్ జిల్లాలోని అజ్ నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగాడు. నిరసనకారులు ఈ దాడితోపాటు బీభత్సం సృష్టించారు.. దీంతో పోలీసులు వేరే గత్యంతరం లేక లవ్ ప్రీతిసింగ్ ను విడిచిపెట్టారు.
ఈ ఘటన ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటి నుంచి అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి దేశంలో అల్లర్లకు కారణమవుతున్నాడు అన్న ఆరోపణలతో అమృత్ పాల్ సింగ్ మీద కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకోవడానికి పక్కా వ్యూహరచన చేశారు. కానీ, చికినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఫిబ్రవరి 14న ఇంకో కార్యక్రమానికి అమృత్పాల్ సింగ్ సమాయత్తం అవుతున్నాడన్న నివేదికల ప్రకారం రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
