Asianet News TeluguAsianet News Telugu

అమృత్‌పాల్ సింగ్ మామూలోడు కాదు.. వాడు ఏం చేశాడంటే.. ?

ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తనకంటూ ఓ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేకంగా కరెన్సీని రూపొందించుకున్నారని, ఖలిస్థాన్ దేశం కోసం జెండాను కూడా రూపొందించారని పోలీసులు గుర్తించారు.  

Amritpal Singh designed, printed Khalistani currency, was creating his own tiger force
Author
First Published Mar 25, 2023, 7:14 AM IST

ఖలిస్తానీ నాయకుడు, కరడుగట్టిన వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డే చీఫ్  అమృతపాల్ సింగ్ గత వారం రోజుల నుంచి పంజాబ్ పోలీసుల కండ్లు కప్పి.. తప్పించుకుని తిరుగుతున్నారు. అతని సహాయకులు, అతని అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని లీలలు ఒక్కొటి బయటపడుతున్నాయి. అమృతపాల్ తనని తాను ఖలిస్తానీ అధినేతగా ప్రకటించుకుని.. ప్రత్యేక దేశ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

పట్టుబడ్డ అతని అనుచరుల ఫోన్లను పరిశీలిస్తే.. తనకంటూ ఓ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు, ప్రత్యేకంగా కరెన్సీని రూపొందించుకున్నట్టు, అలాగే..  ఖలిస్థాన్ ప్రత్యేక దేశం కోసం జెండాను కూడా రూపొందించినట్టు పోలీసులు గుర్తించారు. అమృత్‌పాల్ తన ప్రత్యేక ఆర్మీకి 'ఆనంద్‌పూర్ ఖలిస్తాన్ ఫౌజ్'(ఎకెఎఫ్) అనే పేరు పెట్టుకున్నాడు. ఎకెఎఫ్ కి  ఉగ్రసంస్థలతో లింక్ ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. యువత ఆయుధాలు ఉపయోగించడం నేర్చుకునే వీడియోలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఖన్నా పోలీస్ ఎస్‌ఎస్‌పి అమ్నీత్ కౌందాల్ ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ .. ఖలిస్తాన్ కరెన్సీని డిజైన్ చేసి ముద్రించారనీ, ఆయన ప్రత్యేక దేశ స్థాపన కోసం ఉద్యమం చేస్తున్నట్టు తాము గుర్తించామని తెలిపారు. డాలర్ నుండి కాపీ చేసిన కరెన్సీపై ఖలిస్తాన్ మ్యాప్ కూడా ముద్రించబడినట్టు తెలిపారు.

ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖన్నా పోలీస్ ఎస్ఎస్పీ అమ్నీత్ కొండల్ మాట్లాడుతూ.. అమృతపాల్ సింగ్ అనుచరుల మొబైల్ ఫోన్‌లో AKF హోలోగ్రామ్,ఖలిస్తాన్ కరెన్సీ చిత్రాలతో పాటు "$10" నోటు ఉంది. పాకిస్థానీ జాతీయుడి డ్రైవింగ్ లైసెన్స్ చిత్రం కూడా ఉంది. 'ఖలిస్థాన్ జెండా'పై కొన్ని ఉర్దూ పదాలు రాసి ఉన్నాయన్నారు. అణిచివేత ప్రారంభం కావడానికి ముందే.. అమృతపాల్‌ను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోల్చారు. అతని అనుచరులు 1980లలో ప్రత్యేక సిక్కు దేశం 'ఖలిస్థాన్' కోసం హింసాత్మక ప్రచారం చేశారు. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్‌ను రక్షించే బాధ్యతను అప్పగించిన 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో గూర్ఖా బాబా భాగమని SSP కొండల్ తెలిపారు.

 అమృతపాల్ సింగ్ కొన్ని రాష్ట్రాలను ఎంచుకున్నారని, ఖలిస్తాన్ కోసం జెండాను రూపొందించారని చెప్పారు. కపుర్తలా, పాటియాలా , జింద్ అమృతపాల్ సింగ్ యొక్క ఖలిస్తాన్‌లో చేర్చబడిన ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు. ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఎకెఎఫ్),అమృతపాల్ టైగర్ ఫోర్స్ సభ్యులకు రెజిమెంట్‌లోని సైనికులకు నంబర్లు ఇచ్చే విధంగానే బెల్ట్ పేరుతో ఎకెఎఫ్ నంబర్‌లను ఇచ్చారు. ఈ వ్యక్తులు తమ చేతులపై AKF పచ్చబొట్లు కలిగి ఉన్నారని తెలిపారు.

అమృత్‌పాల్ టైగర్ ఫోర్స్‌లో కేవలం యువకులను మాత్రమే ఉన్నారని ఎస్‌ఎస్‌పి తెలిపారు. అమృతపాల్‌ సన్నిహితుడు తేజిందర్‌ అలియాస్‌ గూర్ఖా బాబా ఫోన్‌లో చాట్‌లు, ఆడియో రికార్డింగ్‌లతో సహా ఆధారాలను పోలీసులు కనుగొన్నారు.ఖలిస్తాన్‌ను సృష్టించేందుకు అమృత్‌పాల్ సింగ్ పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతనికి ఐఎస్‌ఐ సాయం చేస్తోందని పోలీసు అధికారి తెలిపారు.

అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు చేపట్టిన భారీ వేట శుక్రవారం ఏడో రోజుకు చేరుకున్నప్పటికీ, అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. ఖలిస్థాన్ నాయకుడు నేపాల్ గుండా తప్పించుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు నివేదించడంతో నేపాల్ సరిహద్దు పోస్టులు అప్రమత్తమయ్యాయి. కురుక్షేత్ర జిల్లాలోని తన ఇంట్లో అమృతపాల్ సింగ్ , అతని సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌లకు ఆశ్రయం కల్పించిన మహిళను హర్యానా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ కేసులో ఇప్పటివరకు 207 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios