Asianet News TeluguAsianet News Telugu

అమృత్ పాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడు.. విదేశాల నుంచి వీడియో విడుదల...

గత వారం రోజులుగా అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాల మధ్య అమృత్ పాల్ సింగ్ కు చెందిన ఓ వీడియో వెలుగు చూసింది. 

Amrit Pal Singh is still absconding, Video released from abroad - bsb
Author
First Published Mar 29, 2023, 8:24 PM IST

న్యూఢిల్లీ : 12 రోజుల పాటు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రాడికల్ సిక్కు మత బోధకుడు అమృతపాల్ సింగ్, అతను పరారీలో ఉన్నాడని ధృవీకరించే ఓ వీడియోను బుధవారం విడుదల చేశాడు. ఈ వీడియో విదేశాల నుంచి సోర్స్ చేయబడింది. అంతేకాదు, ఈ వీడియో రెండు రోజుల పాతదిగా కనిపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. యూకే హ్యాండిల్స్ అమృతపాల్ వీడియోను పోస్ట్ చేసి ఉంటాయని వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ పంజాబ్‌కు తిరిగి వచ్చాడని, లొంగిపోవడానికి యోచిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఈ వీడియో బయటపడింది.

అమృత్ పాల్ సింగ్ లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసమే అతడు పంజాబ్ కు తిరిగి వచ్చాడని లొంగిపోయే ముందు అంతర్జాతీయ వార్తా సంస్థ ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వీడియో బయటపడడంతో కాస్త గందరగోళం నెలకొంది. గత నెల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై అమృత్ పాల్ సింగ్ దాడి చేశాడు. అక్కడి ఎస్పీతో సహా పలువురు పోలీసుల మీద దాడి చేసిన అమృత్ పాల్ సింగ్… పోలీస్ స్టేషన్లో ఉన్న తన మద్దతుదారులను విడిపించుకుపోయాడు. 

పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్? లొంగిపోవడానికే వచ్చాడా??

ఆ తరువాత పోలీసులు అతడిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అమృత్ పాల్ సింగ్ మాత్రం పోలీసుల కన్నుగప్పి ఉడాయించాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకుని నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ మేరకు ఇంటిలిజెంట్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లోని హోషియార్ పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది.

మంగళవారం రాత్రి వీరిని పట్టుకునేందుకు పోలీసులు హోషియార్ పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు.హోషియార్ పూర్ లోని మారయాన్ గ్రామంలోని గురుద్వారా దగ్గర పొలాల్లో అమృత్ పాల్ సింగ్ తన ఇన్నోవా కారును వదిలేసి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు సమాచారం ఉండడంతో అమృత్పాల్ సింగ్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. 

1980 నాటి పంజాబ్ తిరుగుబాటు జ్ఞాపకాలను పునరుద్ధరించిన తరువాత, అతనిని, అతని మద్దతుదారులను అరెస్టు చేయాలని పంజాబ్ పోలీసులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు, దీనిలో వేలాది మంది మరణించారు. అరెస్టయిన వ్యక్తిని విడిపించుకుని వెళ్లేందుకుఅమృత్‌సర్ సమీపంలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన మూడు వారాల తర్వాత, మార్చి 18న అతనిపై, అతని ఖలిస్థాన్ అనుకూల 'వారిస్ పంజాబ్ దే' సభ్యులపై పోలీసుల దాడి తరువాత  అతను అదృశ్యమయ్యాడు.

జలంధర్ జిల్లాలో వాహనాలను మార్చడం, రూపురేఖలు మార్చడం ద్వారా పోలీసుల వల నుండి తప్పించుకున్నాడు.మంగళవారం, అమృతపాల్ సింగ్ తన ముఖ్య సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి ఉన్న కొత్త వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోలో అమృత్ పాల్ సింగ్ తలపాగా లేకుండా, ముసుగు ధరించి కనిపిస్తున్నాడు.

సీసీటీవీ ఫుటేజీ ఎప్పటిదో స్పష్టత లేదు. ఢిల్లీలోని మార్కెట్ నుండి ఇది దొరికింది. అందులో అమృత్ పాల్ సింగ్ బ్లాక్ షేడ్స్ ధరించి వీధిలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అతని వెనుక, పాపల్‌ప్రీత్ సింగ్ బ్యాగ్‌తో నడుస్తూ కనిపించాడు.ఈ ఫుటేజీపై పంజాబ్ పోలీసులు ఇంకా స్పందించలేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు అమృత్‌పాల్ సింగ్, అతని సహాయకులా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios